యూత్ ను ఆకట్టుకుంటొన్న ‘కెఎస్ 100’ చిత్రం..!!
మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కెఎస్ 100’. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతాన్ని, భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు.. జూలై 5న విడుదలైన ఈ సినిమా యువ ప్రేక్షకుల ఆదరణను అందుకుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జూలై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాము. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు. నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు. నన్ను, నా సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలన్నారు.
చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ ‘కెఎస్ 100’ సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. విడుదలై మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. చిన్నగా విడుదలై సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరు మంచి పొజిషన్స్ కు వెళ్లాలన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ‘కెఎస్ 100’ చిత్రం జూలై 12 న దాదాపు 200 థియేటర్స్ లో రిలీజ్ అయి యూత్ ను ఆకట్టుకుంటోంది... అన్నింటిలోనూ ఆడుతోంది.
ఒక మంచి ట్రెండీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో మా సినిమానే ఉదాహారణ. డైరక్టర్ షేర్ మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు మెసేజ్ మా సినిమా ద్వారా ఇచ్చారన్నారు.
నవనీత్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా నా వర్క్ కుమంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫారూఖ్ మాట్లాడుతూ.. ఐదు సినిమాల మధ్య విడుదలై ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతోందన్నారు.
నటీనటులు : అక్షిత, అషి, పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు :
మాటలు- కథ- కధనం -దర్శకత్వం: షేర్
నిర్మాత : వెంకట్ రెడ్డి
కెమెరా: వంశీ
మ్యూజిక్: నవనీత్ చారి
ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
సాహిత్యం: భాష్య శ్రీ,
కొరియోగ్రఫీ: జొజొ
యాక్షన్: మాలేష్
నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి
అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
ఆర్ట్: సుదర్శన్.