Advertisementt

కామెడీ కింగ్స్ చేతుల మీదుగా ‘గుణ 369’ పాట!

Mon 15th Jul 2019 10:06 PM
guna 369 movie,brahmanandam,ali,second song,karthikeya,rx 100,guna 369 second song  కామెడీ కింగ్స్ చేతుల మీదుగా ‘గుణ 369’ పాట!
Guna 369 Movie second Song Launch కామెడీ కింగ్స్ చేతుల మీదుగా ‘గుణ 369’ పాట!
Advertisement
Ads by CJ

ప్ర‌ముఖ హాస్య‌న‌టులు బ్ర‌హ్మానందం- అలీ చేతుల మీదుగా ‘గుణ 369’లోని ‘బుజ్జి బంగారం...’ పాట విడుద‌ల‌!

‘ఆర్‌.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ, అన‌ఘ జంట‌గా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుణ 369’. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి పాట‌ను ఇటీవ‌ల స్టార్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్‌’ రాజు విడుద‌ల చేశారు. రెండో పాట ‘బుజ్జి బంగారం..’ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, అలీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌ను బ్ర‌హ్మానందం ఆశీర్వ‌దించారు. 

అనంత‌రం అలీ మాట్లాడుతూ.. ‘‘చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన ఈ పాట చాలా బావుంది. ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల‌... నేనూ కొలీగ్స్. ఇద్ద‌రం క‌లిసి చాలా సినిమాలు చేశాం. నిర్మాత‌లు బుల్లితెర‌ మీద స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్ మీద కూడా వాళ్లు చేస్తున్న ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాలి. ప్ర‌తి ఇంట్లోనూ హోమ్ మినిస్ట‌ర్ స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్లు మంచి ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటారు కాబ‌ట్టి ‘బుజ్జిబంగారం’ అనే ప‌దాల‌తో వాళ్ల‌ను పిలుస్తూనే ఉంటాం. నేనూ నా రియ‌ల్ లైఫ్‌లో ‘బుజ్జి బంగారం’ అని పిలుస్తూనే ఉంటాను. అదే పదాల‌తో వ‌చ్చే ఈ పాట బావుంది. అంద‌రూ పాడుకునేలా ఉంది. ఈ చిత్రం కార్తికేయ‌కు ‘ఆర్‌.ఎక్స్.100’ క‌న్నా పెద్ద హిట్ కావాలి’’ అని చెప్పారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘ప్రేమ‌లో ఉన్న ప్ర‌తి అమ్మాయి, అబ్బాయి పాడుకునేలా ఉంది మా ‘బుజ్జి బంగారం...’ పాట‌. ఎవ‌రైనా విన‌గానే మంచి స్టెప్పులు వేసేలా ఉంది. కామెడీ లెజండ్స్ బ్ర‌హ్మానందంగారు బ్లెస్ చేయ‌డం, అలీగారు పాట‌ను లాంచ్ చేయ‌డం గొప్ప అనుభూతిని క‌లిగిస్తోంది. ఇద్ద‌రు యాక్టింగ్ లెజెండ్స్ బ్లెస్సింగ్స్ అందుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో అదృష్టం చేసుకుంటే త‌ప్ప ఇలాంటి అరుదైన అవ‌కాశం దొర‌క‌ద‌ని నాకు తెలుసు. పెద్ద‌ల ఆశీస్సులందుకున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నా’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ‘‘నాలుగ్గోడ‌ల మ‌ధ్య ఊహించి రాసుకున్న క‌థ‌తో ఈ చిత్రాన్ని తీయ‌లేదు. విశాల ప్ర‌పంచంలో జ‌రిగిన య‌థార్థ‌గాథ మా చిత్రానికి ముడి స‌రుక‌య్యింది. స్క్రీన్ మీద కూడా అంతే స‌హ‌జంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్ష‌కుడి గుండెను తాకుతుంది. కామెడీ లెజెండ్స్ ఇద్ద‌రి చేతుల మీదుగా మా చిత్రంలోని రెండో పాట ‘బుజ్జి బంగారం’ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. వారి పాజిటివ్ మాట‌లు మాలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి’’ అని అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బ్ర‌హ్మానందంగారు, అలీగారు పేర్లు విన్నంత‌నే మ‌న పెదాల‌పై తెలియ‌కుండా చిరున‌వ్వులు వ‌చ్చేస్తాయి. అంద‌రిలోనూ అంత పాజిటివ్ ఎన‌ర్జీని నింపే ఆ ఇద్ద‌రు లెజెండ్స్ చేతుల మీదుగా మా చిత్రంలోని రెండో పాట విడుద‌ల కావ‌డం మా అదృష్టం. ‘బుజ్జి బంగారం...’ పాట త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. ప్రేమ‌లో ఉన్న వాళ్లు ఎవ‌రైనా స‌రదాగా స్టెప్పులు వేసుకుంటూ పాడుకునేలా ఉంది. ఈ నెల 17న ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌గారు, మాస్ క‌మ‌ర్షియ‌ల్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుగారి చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాం. ఆగ‌స్ట్ 2న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.

సాంకేతిక నిపుణులు:

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌: జీయమ్‌ శేఖర్, ఎడిటర్: తమ్మిరాజు, డాన్స్: రఘు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య కిశోర్‌, శివ మల్లాల.

Guna 369 Movie second Song Launch:

Brahmanandam and Ali Launches Guna 369 Movie Second Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ