పూరి జగన్నాధ్ సినిమాలంటే ఒకప్పుడు యూత్‌లో మంచి క్రేజ్ ఉండేది. ఎందుకంటే పూరి సినిమాలలోని హీరోలతో యూత్ తమని తాము పోల్చుకునే వారు. కానీ పూరి గత కొన్నాళ్లుగా అంటే ఎన్టీఆర్ టెంపర్ తర్వాత మళ్ళీ ఒక్క సినిమాతోనూ హిట్ కొట్టలేకపోయాడు. పూరి సినిమాల్లో హీరోలు మరీ పోరంబోకులుగా.. అంటే రఫ్ గా కనబడతారు. అందుకే త్వరగా యూత్ కి కనెక్ట్ అవుతారు. ఇక పూరి ఇస్తున్న డిజాస్టర్స్ కి నిర్మాతలెవరు పూరీని నమ్మకపోయేసరికి తానే పూరి కనెక్ట్స్‌తో నిర్మాతగా మారాడు. ఇక హీరోయిన్ గా కెరీర్ ముగిసిన సమయంలో హీరోయిన్ ఛార్మి, పూరి జతకు చేరింది. అప్పట్లో వారి మధ్యలో సంథింగ్ సంథింగ్ అని గుసగుసలు వినబడ్డాయి కూడా. ప్రస్తుతం పూరి, ఛార్మి ఇద్దరూ పార్టనర్స్‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. పూరి తనయుడు ఆకాష్ సినిమా మెహబూబా కోసం ఛార్మి తన డబ్బుని పెట్టుబడిగా పెట్టి.. ఆ సినిమాతో చాలానే పోగొట్టుకుంది. ఇక పూరిదీ అదే పరిస్థితి.
అయితే తాజాగా రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూరి.. ఇస్మార్ట్ నిర్మాతగా లాభాలు ఆర్జించడమే కాదు.. ఛార్మి మెహబూబాతో పోగొట్టుకున్న సొమ్ముని కూడా ఇచ్చేశాడట. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ బిజినెస్ జరగడంతో.. పూరి, ఛార్మి ని గట్టెక్కించాడు. ఛార్మి కూడా నిర్మాతగా.. పూరికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ కి ఛార్మి వన్ అఫ్ ది నిర్మాతగా బడ్జెట్ కంట్రోల్ చెయ్యడంలో కీలక పాత్ర పోషించిందట.
ఫైనాన్స్ వ్యవహారాలన్నీ ఛార్మి దగ్గరుండి చూసుకోవడంతో పాటు షూటింగ్‌కి వేస్టేజ్ అవకుండా చాలా జాగ్రత్తలు తీసుకుందట. ఇక ఆ ధైర్యంతోనే పూరి కూడా ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా షూటింగ్ ని పూర్తి చేసాడట. మరి పూరి ని నమ్ముకుని కూర్చున్న ఛార్మికి పూరి న్యాయమే చేసాడు. ఇస్మార్ట్ లాభాలతో అటు పూరి ఇటు ఛార్మి ఇద్దరూ హ్యాపీ. మరి సినిమా హిట్ కొడితే రామ్ కూడా హ్యాపీ అవుతాడు.. లేదంటే మళ్లీ మామూలే.