Advertisementt

నాగార్జునకు టెన్షన్ మొదలైంది..!

Mon 15th Jul 2019 03:44 AM
manmadhudu 2 movie,latest,update  నాగార్జునకు టెన్షన్ మొదలైంది..!
Tension starts to Manmadhudu 2 నాగార్జునకు టెన్షన్ మొదలైంది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాల జోలికి పోకుండా.. చాలా డీసెంట్ గా ఉండే హీరోల్లో నాగార్జున ఒకడు. అయితే ఇప్పుడు నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2  విషయంలో వివాదాలు నాగార్జునకు తలనొప్పిగా మారాయనేలా ఉంది ప్రస్తుత వ్యవహారం. ఇంతకు ముందు మన్మధుడు 2 స్టోరీని దర్శకుడు రాహుల్ కాపీ కొట్టాడన్నారు. అయితే నాగ్ ఆ వ్యవహారాన్ని డబ్బుతో పరిష్కారించాడనే టాక్ నడిచింది. ఇక తాజాగా బిగ్ బాస్ 3 కి హోస్ట్ కి వెళుతున్న నాగ్ మీద విమర్శలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు బిగ్ బాస్ ని తప్పుబట్టిన నాగ్ ఇప్పుడు హోస్ట్ గా ఎలా వ్యవహరిస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క బిగ్ బాస్ 3 మీద రోజుకో న్యూస్ బయటికొస్తుంది. శ్వేతా రెడ్డి అనే యూట్యూబ్ యాంకర్ బిగ్ బాస్ యాజమాన్యంపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తుంది. మరి అలాంటి షోకి నాగ్ హోస్ట్ అయితే రేపు ఆయన మన్మధుడు 2 సినిమా విషయంలో అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఇక మన్మధుడు 2 దర్శకుడు భార్య సింగర్ చిన్మయి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఎప్పుడూ హైలెట్ అవుతుంది. తాజాగా కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగపై చిన్మయి దారుణమైన కామెంట్స్ చేసింది. దానికి నాగ్ కోడలు టాప్ హీరోయిన్ సమంత వంత పాడింది. మరి మన్మదుడు 2 లో నాగార్జున వయసుమీరిన ప్రేమికుడిగా.... లిప్ లాక్స్ తో రెచ్చిపోయాడు. అంతా సినిమా విడుదల సమయానికి చిన్మయి చేసిన ఆరోపణలు హాట్ హాట్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కబీర్ సింగ్ విషయంలో చిన్మయి చేసిన వ్యాఖ్యలు మన్మధుడు 2 ని ఇబ్బందిపెట్టేవిగా వున్నాయి. ఆ సినిమా విడుదల సమయానికి చిన్మయితో పాటుగా నాగ్ ని కూడా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే నాగార్జున ఇప్పుడు మన్మధుడు 2 సినిమా విషయంలో కాస్త టెన్షన్ ఫీలవుతున్నట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం. 

ఇక నాగార్జున కూడా టెన్షన్ పడి ఉపయోగం లేదు.. అందుకే మన్మధుడు 2 విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. దానిలో భాగంగానే మన్మధుడు 2 లో ఘాటైన సన్నివేశాలను, ఇబ్బంది పెట్టే డైలాగ్స్ ని విడుదలకు ముందు తొలగించాలని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి దీన్నిబట్టి నాగార్జున మన్మధుడు 2 విషయంలో నిజగానే టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తుంది.

Tension starts to Manmadhudu 2:

Manmadhudu 2 Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ