వనవాసం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను - అల్లరి నరేష్.
భవాని శంకర ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి.సంజయ్ కుమార్ నిర్మాణంలో నవీన్ రాజ్ శంకరపుడి, శశి కాంత్, శ్రావ్య, శృతి హీరో హీరోయిన్స్ గా భారత్.పి, నరేంద్ర దర్శకత్వంలో వస్తోన్న సినిమా వనవాసం. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లరి నరేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాజ్ కందుకూరి చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ..
యాక్టర్ అవుదామని వచ్చిన సంజయ్ కుమార్ గారు నిర్మాత అయ్యారు. తన ఫ్రెండ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఆయన మధ్యలో తనువు చాలించారు. ఆ తరువాత సంజయ్ గారు ఈ సినిమాను నిర్మాణ భాద్యతలు తీసుకోవడం విశేషం. ఈ దర్శకులు భరత్, నరేంద్ర గార్లకు మంచి పేరు రావాలి. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ కు ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. వనవాసం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.
నిర్మాత సంజయ్ కుమార్ మాట్లాడుతూ...
20 ఏళ్ళ క్రిత్రం యాక్టింగ్ స్కూల్ లో పరిచయమైన అల్లరి నరేష్ ఇప్పుడు నా చిత్రం వనవాసంను ప్రోత్సహించడానికి రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు భరత్ ఈ సినిమాను కష్టపడి తీసాడు. తనకు ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ ఫంక్షన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ముగించారు.
నిర్మాత తుమ్మలపల్లి రాంసత్యనారాయణ మాట్లాడుతూ...
అల్లరి నరేష్ వనవాసం సినిమాను సపోర్ట్ చేసేందుకు రావడం గొప్ప విషయం. ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వనవాసం ట్రైలర్ గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ బాణీలు బాగున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాత సంజయ్ గారికి పేరుతో పాటు డబ్బు రావాలని కోరుకుంటున్నా అన్నారు.
డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ...
అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. నిర్మాత సంజయ్ గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను తీశారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు.