తారా క్రియేషన్స్ పతాకంపై బ్రహ్మానందరెడ్డి నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బైలంపుడి’. ఒక ఊరిలో జరిగే వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. డైరెక్టర్ అనిల్ పి.జి.రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ వినయ్, తనిష్క తివారి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శనివారం సైబర్‌కన్వెన్షన్‌లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్ మాట్లాడుతూ... ‘‘ఈ చిత్ర ట్రైలర్‌ను చూశాను. చాలా బావుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో ప్రొడ్యూసర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది’’ అని అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘బ్రహ్మానందంరెడ్డి నటించిన చిత్రమిది. ఆయన నా స్నేహితుడు. ఆయనకి నా తరపున ఆల్ ద బెస్ట్. బైలంపుడి అనే పేరు వింటున్నా, చూస్తున్నా తెలియని ఒక చరిత్ర కనిపిస్తుంది. ప్రతి ఊరికి ఏదో ఒక చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఆ చరిత్ర ఏంటి అన్నదే ఈ సినిమా’’ అన్నారు.
అలీ మాట్లాడుతూ.. బైలంపుడి కథగాని, డైరెక్టర్‌గాని, ప్రొడ్యూసర్‌గాని ఎవ్వరూ నాకు తెలియదు. నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి నన్ను ఆహ్వానించారు. ఈ సినిమా తియ్యడానికి చాలా కష్టపడ్డాను అన్నారు. ఈ సినిమా గురించి ఇంత కష్టపడ్డారు కాబట్టి హిట్ అయితే కష్టం అంతా మర్చిపోతారు అన్నారు. సినిమా మీద ప్యాషన్‌తో కొత్తవాళ్ళు రావడం మంచిది. కొత్తనీరు రావాలి. ఈ సినిమాలో నటించినవాళ్ళంతా కొత్తవాళ్ళే అన్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్. బైలంపుడి టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.
ప్రొడ్యూసర్ మాట్లాడుతూ.... ‘‘నాకు ఈ సినిమా విడుదలవ్వడానికి నా చిత్ర యూనిట్ అలాగే ఇక్కడకి వచ్చిన ఎంతో మంది అతిధులు చాలా హెల్ప్ చేశారు. శ్రీనివాస్‌రెడ్డిగారు ఒక డిస్ట్రిబ్యూటర్. రిలీజ్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాని అన్ని ఏరియాల్లో అమ్మేశారు. నేను ఇంత దూరం రావడానికి నా కుటుంబ సభ్యులు నా వెను వెంటే వుండి నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి యుద్ధం చేయాలి గెలవడానికి, పరిగెత్తడానికి రావాలి. మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..... ‘‘కెమెరామెన్‌గా ఉంటూ డైరెక్టర్‌గా వెళ్ళాను. నిర్మాతకి థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా సెన్సిటివ్ పర్సన్ ఎవ్వరికి ఏం హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఆయన నాకు మంచి ఫ్రెండ్ కూడా. అందుకే పని చెయ్యడం చాలా ఈజీ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మ్యూజిక్‌ని అందించారు. సందీప్ కుమార్ ఆర్ ఆర్ చాలా బాగా చేశారు. బైలంపుడి ఒక విలేజ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమాగా తీశాం. మిగతా ఆర్టిస్టులంతా కూడా చాలా బాగా నటించారు. చోడవరంలో షూటింగ్ చాలా న్యాచరల్‌గా జరిగింది. అందరూ మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పద్మనాధ్‌రెడ్డి, డైమండ్ రత్నబాబు, మజిలీ డైరెక్టర్ శివనిర్వాణ, అలీ తదితరులు పాల్గొన్నారు.