Advertisementt

‘ఏయ్ జూనియర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Sun 14th Jul 2019 12:23 PM
aey junior,aey junior first look,pocharam srinivasa reddy,sheikh abdullah,ravikumar ponnaganti  ‘ఏయ్ జూనియర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Aey Junior Movie First Look Poster Released ‘ఏయ్ జూనియర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Advertisement
Ads by CJ

తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా ‘ఏయ్ జూనియర్’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. ఈ చిత్రాన్ని వ్యాంకిష్ మీడియా సంస్థ నిర్మించగా , షేక్ గౌస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రవికుమార్ పొన్నగంటి. 

ఈ సందర్భంగా తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సందేశంతో కూడుకున్న ఈ ప్రేమకథా చిత్రం తప్పక విజయవంతం కావాలని, సమాజానికి ఉపయోగపడే మరెన్నో మంచి చిత్రాలని నిర్మించాలని ఈ చిత్ర దర్శక నిర్మాతలని కోరారు.

ఈ చిత్ర నిర్మాత షేక్ గౌస్ మాట్లాడుతూ.. ‘ఏయ్ జూనియర్’ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డిగారికి ధన్యవాదాలు తెలియచేశారు. యువతని ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయని దర్శకుడు మంచి ప్రతిభావంతుడని, అలాగే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేశారని, సంగీతానికి ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రానికి అమ్మపండు అందించిన సంగీతం మరో హైలెట్‌గా నిలుస్తుందని, ఈ చిత్రాన్ని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం ఉందని తెలిపారు. నిర్మాత షేక్ గౌస్ ఇంకా మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ని వచ్చే వారంలో రిలీజ్ చేయనున్నట్లు ఆడియోని ఆగస్ట్ మొదటి వారంలో, చిత్రాన్ని ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 

చిత్ర దర్శకులు రవికుమార్ పొన్నగంటి మాట్లాడుతూ.. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చక్కని టీనేజ్ లవ్ స్టోరీ‌గా దీన్ని తెరకెక్కించామని, అసభ్యతకు తావులేకుండా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ చిత్రాన్ని నిర్మించామని, ఇందులో పాటలన్నీ యువతకు నచ్చే విధంగా ఉంటాయని ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి టెక్నీషియన్స్‌కి అలాగే దర్శకునిగా అవకాశమిచ్చిన షేక్ గౌస్‌కి ధన్యవాదాలు తెలిపారు. 

ఆయుష్, షిరిన్, ప్రమోదిని, మణిచందన, మున్ని, అనిత, డా.మండవ శ్రీనివాస్, సీతామహాలక్ష్మి, మిమిక్రి శివ, వెంకటేశ్వరరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి

బ్యానర్: వ్యాంకిష్ మీడియా 

సమర్పణ: సబీనా  

నిర్మాత: షేక్ గౌస్ 

సహ నిర్మాతలు: చేపూరి చంద్రకాంత్, పులిషేరి ప్రణిదీప్

రచన దర్శకత్వం: రవికుమార్ పొన్నగంటి 

సంగీతం: అమ్మపండు 

కెమెరా: దుర్గాప్రసాద్ 

ఎడిటర్: కొడగంటి వేణు

పాటలు: ఫణిదీప్ విశ్వనాథ్ , వెన్నెల శ్యామ్, డా. యల్లాప్రగడ మల్లికార్జునరావు.

కొరియోగ్రఫి: అనీష్ , తాజ్‌ఖాన్ 

కో - డైరెక్టర్: సుధాకర్ S 

ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్: నాగిరెడ్డి.

Aey Junior Movie First Look Poster Released:

Telangana Speaker Pocharam Srinivasa Reddy Releases Aey Junior First Look poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ