Advertisementt

నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Sat 13th Jul 2019 10:28 PM
nani,nani gang leader,vikram k kumar,pre look,gang leader first look  నాని ‘గ్యాంగ్ లీడర్’  ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Nani Gang Leader First Look Release Details నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

జూలై 15న నాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’  ఫస్ట్ లుక్ 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ‘నాని గ్యాంగ్ లీడర్’ ప్రీ లుక్ పోస్టర్ నేడు(శనివారం) విడుదల చేశారు. ‘నేను గ్యాంగ్ లీడర్... మా గ్యాంగ్ రెడీగా ఉంది...’ అని నాని ప్రీ లుక్ పోస్టర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమా సబ్జెక్ట్‌కి అనుగుణంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తి రేపేలా ఉండి మంచి రెస్పాన్స్ రాబట్టింది.

నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని జూలై 15న విడుదల చేయనున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్‌ని జూలై 18న, టీజర్ ని జూలై 24న రిలీజ్ చేయనున్నారు. సినిమా ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.     

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌

Nani Gang Leader First Look Release Details:

Nani Gang Leader Pre Look released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ