టాలీవుడ్ పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య.. రేణుదేశాయ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో తన అందచెందాలతో కుర్రకారును కైపెక్కించిన రేణూ.. పవన్‌తో విడాకుల తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఇక ఆమె సినిమాలకు దూరమైపోయినట్లేనని.. పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని అనుకుంటోందని పెద్ద హంగామానే జరిగింది. అది ఎంత వరకు సాధ్యమనే విషయం ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
ఇన్ని రోజులు టీవీ షోలకే పరిమితమైన రేణూ మళ్లీ సినిమాల్లోకి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు.. అయితే తాజాగా.. రీ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిపోయిందని ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్టువర్ట్‌పురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వర రావ్’ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు గాను రేణూను సంప్రదించారట.
ఈ విషయమై స్టార్ రచయిత సాయి మాధవ్ మాట్లాడుతూ.. ఎస్.. ఈ సినిమాలో రేణు దేశాయ్‌ని ఒక పాత్ర కోసం అనుకున్నామని.. త్వరలోనే ఆ విషయమై అఫీషియల్ ప్రకటన విడుదల చేస్తామన్నారు. మొత్తానికి చూస్తే ‘టైగర్ నాగేశ్వర రావ్’ బయోపిక్ ద్వారా పవన్ మాజీ భార్య సినిమాల్లోకి మళ్ళీ రాక దాదాపు ఫిక్స్ అయిపోనట్లేనని అర్థం చేస్కోవచ్చు. మున్ముంధు చిత్రబృందం ఏం చెప్పబోతోంది..? రేణూ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.