Advertisementt

‘కేజీఎఫ్’ డైరెక్టర్‌తో తెలుగు స్టార్ హీరో.. ఫిక్స్!

Sat 13th Jul 2019 12:51 AM
prashanth neel,young tiger ntr,kgf,mythri movie makers,uv creactions,tollywood  ‘కేజీఎఫ్’ డైరెక్టర్‌తో తెలుగు స్టార్ హీరో.. ఫిక్స్!
KGF Director Next film with Tollywood Star Hero ‘కేజీఎఫ్’ డైరెక్టర్‌తో తెలుగు స్టార్ హీరో.. ఫిక్స్!
Advertisement
Ads by CJ

‘కేజీఎఫ్’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. దాదాపు ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో ఈచిత్రం రిలీజ్ అయింది. ఈసినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా ఇండియా మొత్తం పాపులర్ అయిపోయాడు. ఇతని స్టామినా ఏంటో కూడా తెలిసిపోయింది. అయితే ఈసినిమా రిలీజ్ అయిన తరువాత మన టాలీవుడ్ నుండి మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలే ప్రశాంత్ నీల్ ప్రతిభను కొనియాడారు. ఇతని డైరెక్షన్‌లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు.

ఆమధ్య ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నాడని దాన్ని యు.వి.క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఎన్టీఆర్ - మైత్రి మూవీస్ వారితో సినిమా చేసేందుకు  ప్రశాంత్ నీల్  ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడట. దీనిపై తాజాగా మైత్రి మూవీస్ నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

‘కేజీఎఫ్’ సినిమా ఎన్టీఆర్ కి బాగా నచ్చింది. మాతో తన వద్ద మంచి కథ ఉంటే చేద్దాం అని ఎన్టీఆర్ మైత్రి నిర్మాతకు చెప్పాడట. దాంతో వారు ప్రశాంత్ ని కలిశారు. అతను చేస్తాను అని చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్‌లో ఉందని నవీన్ తెలిపారు. ఇది చాలా టైం పడుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పూర్తవ్వాలి. అలానే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఎండింగ్ కి ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని నవీన్ అన్నారు.

KGF Director Next film with Tollywood Star Hero :

Prashanth Neel Next film with Young Tiger NTR 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ