Advertisementt

ఆమె కోసం బిగ్ బీతో మెగాస్టార్ మంతనాలు!

Thu 11th Jul 2019 09:24 PM
chiranjeevi,aishwarya rai,heroine,koratala film,big b,help  ఆమె కోసం బిగ్ బీతో మెగాస్టార్ మంతనాలు!
Aishwarya Rai Opposite Chiranjeevi? ఆమె కోసం బిగ్ బీతో మెగాస్టార్ మంతనాలు!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సైరాలో ముఖ్యపాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే సైరా తరువాత చిరంజీవి.. కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చిరు వెయిట్ తగ్గే పనిలో ఉన్నాడు.

ఇక డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా కోసం క్యాస్టింగ్ పనులను చూసుకుంటున్నారు. అయితే ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈమూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. కారణం చిరు సైరా చిత్రం షూటింగ్ లేట్ అవడమే. అయితే ఇంతవరకు కొరటాల హీరోయిన్‌ని ఫైనల్ చేయలేదు. ఆమధ్య అనుష్క, తమన్నా, నయనతార వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ అవి ఏవీ ఫైనల్ కాలేదు.

కొత్త ఫ్రెష్ ఫేస్‌ని తీసుకోవాలని కొరటాల భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్‌ని రంగంలోకి దింపాలని కొరటాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే డైరెక్ట్‌గా ఆమెను కాంటాక్ట్ చేస్తే ‘నో’ చెబుతుంది కాబట్టి అమితాబ్ బచ్చన్ రికమండేషన్‌తో ఐశ్వర్యరాయ్‌ని ఒప్పించాలని చూస్తున్నారట. అమితాబ్, చిరులు కలిసి నటించడమే కాకుండా, వీరిద్దరు మంచి స్నేహితులు కూడా కావడంతో.. ఆయన ద్వారా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. మరి అందుకు ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Aishwarya Rai Opposite Chiranjeevi?:

Chiranjeevi Takes Help From Big B for Aishwarya Rai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ