Advertisementt

మీడియా వారిని అంత మాట అనేసిందేంటి?

Thu 11th Jul 2019 09:20 PM
kangana ranaut,media,fire,sensational comments,mental hai kya movie,bollywood  మీడియా వారిని అంత మాట అనేసిందేంటి?
Kangana Ranaut Fires on Bollywood Media మీడియా వారిని అంత మాట అనేసిందేంటి?
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఈ పేరు పక్కన కాంట్రవర్సీ యాడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడూ కాంట్రవర్సీ వార్తల్లో ఉండే ఈమె లేటెస్ట్ గా మీడియా వారిని నోటికి వచ్చినట్లు తిట్టింది. రీసెంట్ గా ఆమె ‘మెంటల్ హై క్యా’ అనే చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో మీడియా వారిపై అవాకులు చెవాకులు పోయింది.

‘మణికర్ణిక’ చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టును దుర్భాషలాడింది. దాంతో అక్కడ జర్నలిస్టులు అంత కంగనా తమకు సారీ చెప్పాలని లేకపోతే ఆమెకు మేము  కవరేజ్ చేయము అంటూ ప్రకటించారు. గొడవ మరి పెద్దది అవ్వడంతో చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పింది కానీ కంగనా సారీ చెప్పలేదు. అక్కడితో కంగనా ఆగలేదు. మీడియాను దుర్భాషలాడుతూ వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియోలో.. ‘‘ఫ్రీ గా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని మేము ఏ విధంగా జర్నలిస్టులని పిలవాలి? నన్ను మీరు బాన్ చేయడం కాదు నేను అడుగుతున్న నన్ను బాన్ చేయమని. ఎందుకంటే నా పేరు చెప్పుకుని మీరు డబ్బులు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?’’ అని గట్టిగా మీడియా వారిపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఒకవేళ నిజంగానే మీడియా వారు కంగనాను కవరేజ్ చేయకపోతే ఆమె పరిస్థితి ఏంటి?

Kangana Ranaut Fires on Bollywood Media:

Kangana Ranaut Sensational comments on Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ