ప్రతి సంక్రాంతికి పోటీ చాలా గట్టిగా ఉంటుందని తెలిసిందే. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అన్ని సంక్రాంతికి రిలీజ్ అవుతుంటాయి. ఈ సీజన్ లో రిలీజ్ చేసుకుని ప్రొడ్యూసర్స్ మనీ కాష్ చేసుకోవాలని వారి ప్రయత్నం. అలానే వచ్చే సంక్రాంతికి కూడా అంటే 2020 సంక్రాంతికి ఈసారి గట్టి పోటీ వుంటుందని అర్ధం అయిపోయింది.
ఆల్రెడీ కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా సంక్రాంతికి రావాలని అనుకుంటున్నారట. అయితే మొదటినుండి నాగార్జున వచ్చే సంక్రాంతికి రావాలని అనుకున్నాడు.. కానీ ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. నాగార్జున - రమ్యకృష్ణ - నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా సంక్రాంతికి రావడం లేదు. అసలు ఈమూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ప్రస్తుతం నాగ్ మన్మథుడు 2 ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ తరువాత వెంటనే బంగార్రాజు సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు.
సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో సంక్రాంతి నుండి ఆ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయింది. ఈనెల నుంచి మూడు నెలల పాటు నాగార్జున బిగ్ బాస్ 3లో బిజీగా వుంటారు. అందుకే బంగార్రాజు షూటింగ్ లేట్ అవుతుంది.