మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోస్ వచ్చారు. కానీ కొంతమందే క్లిక్ అయ్యారు. అలానే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొణిదెల నిహారిక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ వర్క్ అవుట్ అవ్వడంలేదు. ఈమె నటన స్టార్ట్ చేసి చాలా కాలం అయింది.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లో నటిస్తూ, నిర్మించింది. అయితే ఆమెకు నచ్చిన సినిమాలు చేస్తున్న నిహారికకు సినిమాలు అసలు కలిసి రావడంలేదు. దాంతో ఆమె ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేయాలనే నిర్ణయానికి వచ్చేసిందనీ, ఈ విషయాన్ని తండ్రితోను చెప్పేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
సినిమాలకు గుడ్ బై చెప్పేసి కేవలం వెబ్ సిరీస్ పైనే ఫోకస్ చేయాలనీ డిసైడ్ అయిందట నిహారిక. ఆమెకు వెబ్ సిరీస్ తోనే మంచి అవకాశాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రీసెంట్ గా సైరా సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసింది.