Advertisementt

ప్రముఖ నిర్మాత చేతుల మీదుగా ‘దర్పణం’ సాంగ్!

Tue 09th Jul 2019 11:34 PM
raj kandukuri,darpanam,eduraye song,launches  ప్రముఖ నిర్మాత చేతుల మీదుగా ‘దర్పణం’ సాంగ్!
Darpanam Eduraye Song Released ప్రముఖ నిర్మాత చేతుల మీదుగా ‘దర్పణం’ సాంగ్!
Advertisement
Ads by CJ

దర్పణం చిత్రం నుండి ఎదురయే  సాంగ్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం ‘ద‌ర్ప‌ణం’.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రం నుండి ఎదురయే  లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - సాంగ్ చాలా బాగుంది. సిద్దార్థ్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు సినిమాను బాగా తెరకెక్కించారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్  రామ‌కృష్ణ వెంప మాట్లాడుతూ...  క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం చాలా బాగా వచ్చింది..  లాస్ట్ మినిట్ వ‌ర‌కు ఏం జ‌రుగుతుందా అని స‌స్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది..   న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ గారి సహకారం మర్చిపోలేనిది.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు.. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది.. జూలైలో విడుదల కాబోతుంది అన్నారు.. 

నిర్మాత  క్రాంతి కిర‌ణ్ వెల్లంకి మాట్లాడుతూ.... మా చిత్రం నుండి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్.   చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాము. ఈ చిత్రానికి అందరు సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాము. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుంది. ఈ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.. 

కెమెరామెన్: స‌తీష్‌ముత్యాల‌, ఎడిట‌ర్: స‌త్య‌గిడుతూరి,  మ్యూజిక్ డైరెక్ట‌ర్: సిద్దార్ధ్ స‌దాశివుని, ప్రొడ్యూస‌ర్: క్రాంతి కిర‌ణ్ వెల్లంకి,  డైరెక్ట‌ర్: రామ‌కృష్ణ‌. వెంప‌.

Darpanam Eduraye Song Released:

Raj Kandukuri Launches Darpanam Eduraye Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ