Advertisementt

రకుల్ A సర్టిఫికెట్ చూపించింది

Tue 09th Jul 2019 10:08 PM
manmadhudu 2 teaser,smoking,avantika,a certificate,rakul preet singh  రకుల్ A సర్టిఫికెట్ చూపించింది
Manmadhudu 2 Teaser Review: Avantika As A Certificate Girl రకుల్ A సర్టిఫికెట్ చూపించింది
Advertisement
Ads by CJ

రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మన్మథుడు 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ గత నెలలో విడుదలవగా.. ఆ టీజర్‌లో నాగార్జున మన్మథుడు 2 లో ఎలా ఉండబోతున్నాడో.. అతని పాత్ర స్వభావంతో పాటుగా... లుక్ అన్ని రివీల్ చేసాడు దర్శకుడు రాహుల్. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్రని కూడా ఈ రోజు (మంగళవారం) విడుదల చేసిన టీజర్‌లో పరిచయం చేసాడు. అవంతిక పాత్రలో రకుల్ కొంచెం హాట్ కొంచెం నీట్ గా స్పైసీ లుక్స్‌తో ఇరగదీసింది.

నటి లక్ష్మీ... రకుల్‌ని అవంతికగా సంప్రదాయమైన, పద్దతి గల పిల్లగా పరిచయం చేస్తుంది. ముందు పద్దతిగానే కనిపించిన రకుల్ హాట్ హాట్ గా నాగార్జునతో సరసమాడుతూ.... ఇప్పటివరకు U సర్టిఫికెట్ నే ట్రై చేసాను.. ఇప్పటి నుండి A సర్టిఫికెట్ ని చూపిస్తా అంటూ... సిగరెట్ తాగుతూ అందరికి షాకిచ్చింది. మరి ఇంట్లో పద్దతిగా ఉండే అమ్మాయి.... బయటికొస్తే మాత్రం రెచ్చిపోయి స్మోకింగ్ గట్రా చేస్తుందని... అలా అల్లరిపిల్లగా నాగార్జునని పడెయ్యడానికి ట్రై చేసే పాత్రలో రకుల్ ని చూపించాడు రాహుల్. మరి రకుల్ పాత్రని చూస్తుంటే మన్మథుడు 2 లో హాట్ హాట్‌గా రెచ్చిపోవడం ఖాయంగానే కనబడుతుంది.

Click Here for Avanthika Teaser

Manmadhudu 2 Teaser Review: Avantika As A Certificate Girl:

Manmadhudu 2 Teaser: ‘Smoking’ Hot Avantika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ