Advertisementt

సమంత, కాజల్-తమన్నాల మధ్య తేడా ఇదే!

Tue 09th Jul 2019 10:00 PM
samantha,craze,tamanna,kajal agarwal,hit movie,marriage  సమంత, కాజల్-తమన్నాల మధ్య తేడా ఇదే!
Samantha beats Kajal and Tamanna సమంత, కాజల్-తమన్నాల మధ్య తేడా ఇదే!
Advertisement
Ads by CJ

సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా ఇలా అందరూ కొద్దిగా అటు ఇటుగా టాలీవుడ్‌కి పరిచయం అయినవారే. కాజల్, సమంత ఇద్దరూ దగ్గర ద్గగర స్టార్ స్టేటస్ అనుభవించారు. తమన్నా మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో నటించకపోయినా.. స్టార్ హీరోలందరితో నటించింది. ఇక సమంత, కాజల్ ఇద్దరూ పోటాపోటీగా నటిస్తూ వచ్చారు. ఇక వాళ్లలో సమంత పెళ్లి చేసుకుని సెటిల్ అవడమే కాదు.. కెరీర్ లోను దూసుకుపోతుంది. ఇక కాజల్ పెళ్లి పేరెత్తకుండా ఇంకా నటిస్తూనే ఉంది. మొన్నామధ్య ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ అయ్యి.. కాజల్ మళ్ళీ పుంజుకుంది అనుకుంటే... ఈ ఏడాది సీత లాంటి సినిమాలు ఆమెను వెనక్కి నెట్టేశాయి.

ఇక తమన్నా బాహుబలి తర్వాత ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు చాలా వరకు ప్లాప్స్. అయినా బాలీవుడ్ మీద మక్కువతో టాలీవుడ్‌ని చిన్న చూపు చూస్తుంది ఈ చిన్నది. ఇక కాజల్, తమన్నాలు పరిస్థితి అలా ఉంటే.. సమంత మాత్రం ఇప్పటికీ క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యు టర్న్, తమిళనాట సూపర్ డీలక్స్’.. ఇక తాజాగా మజిలీ, ఓ బేబీ సినిమాల హిట్‌తో సమంత ఇంకా క్రేజీగా తయారైంది. కానీ సమంత ముందు కాజల్, తమన్నాలు వెలవెలబోతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఇంకా హీరోయిన్స్ వేషాల కోసం వారు ఎదురు చూస్తుంటే.. సమంత మాత్రం పెళ్లి చేసుకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. 

Samantha beats Kajal and Tamanna:

Samantha Craze Doubled then Kajal and Tamanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ