Advertisementt

సమంత సీక్రెట్ బయటపడిందోచ్.. !

Tue 09th Jul 2019 06:58 PM
samantha,secret tattoo,oh baby,naga chaitanya,heroine samantha  సమంత సీక్రెట్ బయటపడిందోచ్.. !
Samantha Secret Revealed సమంత సీక్రెట్ బయటపడిందోచ్.. !
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ సమంత సీక్రెట్ బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న సామ్ ఫ్యాన్స్, అక్కినేని అభిమానులు వామ్మో.. ఎన్నిరోజులుగా ఈ సీక్రెట్ దాచుకుందో అంటూ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇటీవల నిర్వహించిన ‘ఓ బేబీ’ సక్సెస్ మీట్ వేదికగా సామ్ సీక్రెట్ బయటపడింది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో.. సామ్ ఈ టైమ్‌లోనే ఎందుకు బయటపెట్టిందో అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

సామ్-చైతు ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలిపోయి.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లవ్ ట్రాక్ నుంచి లైఫ్ ట్రాక్ వరకు సాఫీగానే సాగిపోతోంది. అటు చైతూ భార్యగా.. ఇటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సమంత ఓ మెరుపు మెరుస్తోంది. ఈ బ్యూటీ చైతూతో లవ్‌లో ఉన్నప్పుడు ఓ టాటూ వేయించుకుంది. అది కూడా ఏ చేతికో.. మెడపైనో కాదు.. నడుం మీదో కాదండోయ్ ఏకంగా పక్కటెముకల వద్ద టాటూ వేయించుకుంది. 

ఓ బేబీ ప్రెస్‌మీట్ వేదికగా ఈ టాటూ బయటపడింది. ఇన్ని రోజులుగా ఎక్కడ తన సినిమాల్లో గానీ.. ఫొటో షూట్‌లోగానీ బయటపడకుండా చూసుకుంటూ వస్తున్న సామ్ ఇంకా దాచుకోవడం ఎందుకులే అని సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఆ టాటూ మరేదో కాదు.. చైతూ పేరే. ఇదిలా ఉంటే.. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సామ్.. ‘నేను చాలా అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నేను ఇప్పటి వరకూ దాచి పెట్టిన ఒకే ఒక్క టాటూ చివరికి బయట పడింది. నా భర్త నాగ చైతన్యే నా ప్రపంచం’ అని సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ ఫొటోకు అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.

Samantha Secret Revealed :

Heroine Samantha Secret Tattoo Opened at Oh Baby Function

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ