Advertisementt

సినిమాలకు త్వరలో సమంత గుడ్ బై..!?

Mon 08th Jul 2019 02:13 PM
samantha,tollywood,movies,good bye  సినిమాలకు త్వరలో సమంత గుడ్ బై..!?
Will Samantha say Goodbye to Movies ? సినిమాలకు త్వరలో సమంత గుడ్ బై..!?
Advertisement
Ads by CJ

అవునా.. సమంత ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ప్రస్తుతానికి కాకపోయిన మరో ఒకట్రెండేళ్లలో సినిమాలకు గుడ్ బై చెప్పాలని సమంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆమె మాటలను బట్టే తెలిసిపోతోంది. ఓ ‘బేబీ’ సక్సెస్ మీట్‌లో సమంత మాట్లాడిన మాటలను కాస్త నిశితంగా గమనిస్తే అసలు విషయమేంటో మీకే అర్థమవుతుంది.

ఆదివారం నాడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ‘ఓ బేబీ’ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన సామ్.. సినిమా విజయం సాధించడంపై భావోద్వేగానికి గురైంది. సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనిపోస్తుందంటూ దర్శకురాలు నందినిరెడ్డితో.. సమంత మనసులోని మాటను పంచుకున్నట్లు చెప్పేసింది. 

సామ్ అన్న ఈ మాటలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. సమంత అప్పుడే ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటోంది..? ఇక లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనకుంటోందా..? లేక పిల్లలను కనాలని అనుకుంటోందా..? ఇవన్నీ కాకుండా నిర్మాణ రంగానికి ఏమైనా పరిమితం కావాలని భావిస్తోందా..? అనేది తెలియాల్సి ఉంది. సామ్ అన్న మాటలకు రకరకాలుగా ఆమె ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు. మరి ఫైనల్‌గా అక్కినేని కోడలు ఏం చేస్తుందో చూడాలి మరి.

Will Samantha say Goodbye to Movies ?:

Will Samantha say Goodbye to Movies ?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ