Advertisementt

‘బిగ్ బీ’గా వచ్చేస్తున్న బాలయ్య.. సెట్ అవుతారా!?

Mon 08th Jul 2019 02:06 PM
balakrishna,pink,telugu,dil raju  ‘బిగ్ బీ’గా వచ్చేస్తున్న బాలయ్య.. సెట్ అవుతారా!?
Balakrishna in Telugu remake of Pink? ‘బిగ్ బీ’గా వచ్చేస్తున్న బాలయ్య.. సెట్ అవుతారా!?
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో అనిరుద్ధ రాయ్ చౌదరి తెరకెక్కించిన త్రిల్లర్ మూవీ ‘పింక్‌’. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో పాటు బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో పలువురు ఈ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే తమిళ్‌లో అజిత్, శ్రద్ధా శ్రీనాథ్‌లు ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

ఇక తాజాగా ఈ ‘పింక్‌’ను టాలీవుడ్‌లోనూ రీమేక్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.  ఈ ఆలోచన చేసింది ఎవరో కాదండోయ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు అని పుకార్లు నడుస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే బిగ్ బీ పాత్రలో ఎవరైతే సూట్ అవుతారని నిశితంగా కొన్ని రోజుల పాటు ఆలోచించిన ఆయన.. ఫైనల్‌గా బాలయ్యను ఫిక్స్ చేసేసినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి బాలయ్య వరుస అట్టర్ ప్లాప్ సినిమాలతో పాటు.. ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు, ఎన్నికల్లో కూడా గట్టిగానే ఖర్చుపెట్టేశారు. సినిమాలు సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా మాత్రం తృటిలో తప్పించుకుని గెలిచి గట్టెక్కేశారు. దీంతో మళ్లీ సినిమాలు తీసి ఆ ఖర్చులను ఫుల్ పిల్ చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ ‘పింక్’ సినిమా విషయమై త్వరలోనే దిల్ రాజు-బాలయ్య మధ్య చర్చకు రానుందట. మరి బిగ్‌ బీ నటించిన పాత్రలో బాలయ్య సెట్ అవుతారా..? లేక కథలోనే మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా..? అసలు ఈ సినిమాలో నటించడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో అనేదానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే మరి.

Balakrishna in Telugu remake of Pink?:

Balakrishna in Telugu remake of Pink?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ