3 సినిమాలు, ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న నటుడు, నిర్మాత విష్ణు మంచు
నటుడు, నిర్మాత విష్ణు మంచు పెద్ద రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని మూడు యాక్షన్ డ్రామా చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో ఓ హాలీవుడ్ చిత్రం కూడా ఉంది. అందులో భాగంగా రెండు చిత్రాలు, వెబ్‌సిరీస్‌ను ఆదివారం తన ప్రొడక్షన్ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్‌బాబు, శ్రీమతి నిర్మల, విష్ణు శ్రీమతి విరానికా మంచు సహా పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
విష్ణు మంచు, కాజల్ జంటగా ఓ యాక్షన్ డ్రామా ముందుగా రూపొందనుంది. ఇండియాలో ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకునే ఓ నిజ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. రూ. 2800 కోట్ల దోపిడీ ఎలా జరిగిందనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
సుబ్బరాజు అనే కొత్త దర్శకుడితో కలిసి న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీని నిర్మించనున్నారు మంచు విష్ణు. ఈ చిత్రానికి ‘మిరా రోడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది కూడా నిజ ఘటనను ఆధారంగా చేసుకునే తెరకెక్కనుంది. ఈ సినిమాలో స్టార్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలోనే విడుదల చేయనున్నారు.
అలాగే మంచు విష్ణు తొలిసారి హాలీవుడ్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. జెఫ్రె చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర ప్రధాన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా నిజ ఘటనలను బేస్ చేసుకునే రూపొందుతోంది. విష్ణు సతీమణి విరానికా మంచు ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారారు. వయా మార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.
రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితుల్లోని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందబోయే పొలిటికల్ డ్రామా వెబ్‌సిరీస్‌ను విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌తో రాజ్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కబోయే ఈ వెబ్‌సిరీస్‌కు డైలాగ్స్, స్క్రీన్‌ప్లేను పరుచూరి గోపాలకృష్ణ సమకూరుస్తున్నారు.