హీరోయిన్స్ అంటే... సినిమాల విషయంలో ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తారో... ప్రమోషన్స్ విషయమే కాదు... మీడియా తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అంతే కమిట్మెంట్ తో ఉంటారు. మీడియా తో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎంత టాప్ రేంజ్ హీరోయిన్ అయినా.... మీడియా ముందు మాత్రం ఎలాంటి అహంకారం చూపించారు. ఒకవేళ అలంటి వేషాలేస్తే... మీడియా వాళ్ళని ఉతికి ఆరేసినంత పనిచేస్తుంది. అందుకే మీడియా తో హీరోయిన్స్ అయినా పెద్ద పెద్ద హీరోలైన చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే తాజాగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న ఒక హీరోగారి కూతురు మాత్రం అలా లేదు. మీడియా ముందు కాస్త యాటిట్యూడ్ చూపించడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఒకప్పుడు నాగార్జున, చిరు, బాలయ్య అంత కాకపోయినా.. మంచి మంచి సినిమాల్తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకున్న ఓ సీనియర్ హీరో కూతురు ఇప్పుడు పెద్ద చదువులు చదివి... హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే... ఒక స్టార్ రేంజ్ హీరోగారి తమ్ముడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.... ఆ డెబ్యూ హీరోయిన్ గారు మీడియా కి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ మంచి హుషారుగా ఉంది. అయితే పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా మీడియా దగ్గర ఒళ్లుదగ్గరపెట్టుని..వ్యవహరిస్తే సదరు కుర్ర హీరోయిన్ మాత్రం మీడియా ఫోటో గ్రాఫేర్స్ ఫొటోస్ తీస్తుంటే.. నాలుగైదు ఫొటోస్ తియ్యగానే.. ఇక చాలు అన్నట్టుగా అక్కడనుండి వెళ్లిపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
మరి ఎంత హీరో కూతురైన.. అలా యాటిట్యూడ్ చూపించడం అనేది కర్రెక్ట్ కాదనే విషయం అమ్మడుకి త్వరలోనే అర్ధమయినా.. ప్రస్తుతం అయితే ఆమె మీడియా కి అడ్డంగా దొరికిపోయింది. ఎంత టాప్ హీరోయిన్స్ అయినా.. ఫోటో గ్రాఫేర్స్ ఫొటోస్ తీస్తుంటే... ఇష్టమున్నా లేకపోయినా... స్మైల్ ఫేస్ తో 100 నుండి 200 ఫొటోస్ దిగుతారు. మరి ఈ కుర్ర హీరోయిన్ నటించిన మొదటి సినిమా ఇంకా థియేటర్స్ లోకి రాకముందే.. ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంటే.. సినిమా విడుదలై హిట్ కొడితే.. ఏ రేంజ్ మెయింటింగ్ చేస్తుందో చూద్దాం.