Advertisementt

RRR: ఓ R రొమాన్స్‌కు రెడీ అవుతోంది

Sun 07th Jul 2019 09:33 PM
rrr,ram charan,romance,alia bhatt,rajamouli,pune  RRR: ఓ R రొమాన్స్‌కు రెడీ అవుతోంది
RRR Movie Latest Update RRR: ఓ R రొమాన్స్‌కు రెడీ అవుతోంది
Advertisement
Ads by CJ

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRRలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటించనుంది. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం జక్కన్న అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. రాజమౌళి తిరిగి రాగానే వెంటనే చరణ్, అలియా కాంబినేషన్ లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.

ఈ షెడ్యూల్ ని రాజమౌళి పూణే, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక రీసెంట్ గా రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఫైట్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసారు. ఇందులో రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా, అలియా ఆయన జోడిగా సీత పాత్రలో కనిపిస్తుందట.

అలానే ఇందులో మరోముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కనిపించనున్నారు. దాదాపు 350 కోట్లతో ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జులై 30 న ఈ సినిమాను రిలీజ్ చేస్తునట్టు అధికారంగా ప్రకటించారు మేకర్స్.

RRR Movie Latest Update:

Ram Charan and Alia Bhatt’s romantic Scenes in RRR Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ