Advertisementt

సమంతా.. నీ జాతకానికో దండం : చార్మీ

Sun 07th Jul 2019 07:43 PM
charmi kaur,tweet,samantha,oh baby movie  సమంతా.. నీ జాతకానికో దండం : చార్మీ
Charmi praises Samantha Oh Baby Movie సమంతా.. నీ జాతకానికో దండం : చార్మీ
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లోకి సమంత ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్‌లతో స్టార్ హీరోల సరసన నటిస్తూ.. నటీమణులందర్నీ వెనక్కి నెట్టి స్టార్ హీరోయిన్‌గా సామ్ ఎదిగిపోయింది. ఆమె ప్రస్తుతం ఎవరికీ అందని రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక తాజాగా.. ‘ఓ బేబీ’ సినిమాతో సమంత మరో మైల్‌స్టోన్ చేరుకుంది.

జూలై-05న విడుదలైన ‘ఓ బేబీ’ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా చూసిన నటీనటులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసి ఇప్పుడు నిర్మాణ రంగానికే పరిమితమైన చార్మి ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది.

‘ఏ టైమ్‌లో పుట్టావమ్మా  సమంతా.. నువ్వు. నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్, నీ జాతకానికో నమస్కారం. నీకు, నందినీరెడ్డి టీమ్‌కు శుభాభినందనలు’ అని ఫుల్‌ జోష్‌తో చార్మీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతేకాదు.. ఈ ట్వీట్‌కు సామ్‌‌రాక్స్‌, ఓ బేబీ రాక్స్‌, నందినిరెడ్డి అనే హ్యాష్‌ ట్యాగ్‌‌లను జత చేస్తూ ఎమోజీలను చార్మీ పోస్ట్ చేసింది. చార్మీ ట్వీట్‌కు సామ్ ఎలా రియాక్ట్ అవుతుందో మరి.

Charmi praises Samantha Oh Baby Movie:

Charmi kaur tweet on Samantha Oh Baby

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ