ముంబైలో ఓ రెస్టారెంట్ నుంచి రకుల్ ప్రీత్‌సింగ్ బయటికొస్తుండగా కొందరు అనాథ పిల్లలు ఆమె చుట్టూ చేరి మేడమ్.. మేడమ్ చేయి చాచి డబ్బులివ్వమని అడిగినట్లున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రకుల్ మరీ ఇంత పిసినారా..? అని మండిపడుతున్నారు.
ఆమె హోటల్ నుంచి రాగానే పాపం.. ఆ ఆడపిల్లలందరూ మేడం .. మేడం చేయి చాచి అడిగినా వారిపై రకుల్ జాలీ, దయ చూపించలేదు. పాపం.. ఒక చిన్న పిల్ల అయితే రకుల్ కారు డోర్ కూడా తీసింది కూడా.. కారులోపల కూర్చున్నాక డబ్బులిస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ రకుల్ మాత్రం సైలెంట్‌గా కారులో వెళ్లిపోయింది.
కనీసం ఆ హాటల్ సిబ్బందికి అయినా రకుల్ తోచినంత పైసలిచ్చి.. ఆ పిల్లలకు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయుంటే బాగుండేది కానీ రకుల్ ఇలా ఎందుకు చేసిందబ్బా అని అభిమానులు సైతం మండిపడుతున్నారు. అనాధ పిల్లల పట్ల రకుల్ బేబీకి ఏ మాత్రం కనికరం లేదంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. సెలబ్రిటీలకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కామన్ అన్న విషయం తెలిసిందే.