Advertisementt

‘కెఎస్‌ 100’ మంచి అనుభూతిస్తుంది: నిర్మాత

Sun 07th Jul 2019 12:31 PM
producer,k venkat ramireddy,ks 100 movie,interview  ‘కెఎస్‌ 100’ మంచి అనుభూతిస్తుంది: నిర్మాత
KS 100 Producer K Venkat Ramireddy Interview ‘కెఎస్‌ 100’ మంచి అనుభూతిస్తుంది: నిర్మాత
Advertisement
Ads by CJ

‘కె ఎస్‌ 100’ ఆడియన్స్ కి మంచి అనుభూతి ఇచ్చే రొమాంటిక్‌ హారర్‌ చిత్రం - నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి

చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మాతగా మోడలింగ్‌ స్టార్స్‌ సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్‌ హీరోహీరోయిన్‌లుగా షేర్‌ (షాలిని ఫేమ్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కె ఎస్‌ 100’.. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌, ఆడియో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. జూలై12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి ఇంటర్వ్యూ. 

మీ జర్నీ గురించి చెప్పండి? 

- మాది ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ బిజినెస్‌. నేను 1995 నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎక్కువగా ఇంగ్లీష్‌ మూవీస్‌ని తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేసేవాడిని. ఇప్పటి వరకు నేను దాదాపు 25 మూవీస్‌ని విడుదల చేశాను, అవి నాకు మంచి పేరు తెచ్చాయి. తరువాత నిర్మాతగా 2000లో ‘టైమ్‌ పాస్‌’ అనే తెలుగు సినిమా ద్వారా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తరువాత ‘మోడ్రన్‌ గర్ల్‌’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను. ఇప్పుడు ‘కె ఎస్‌ 100’ నిర్మాతగా నా మూడవ చిత్రం. 

కెఎస్‌ 100 గురించి ? 

- ఇది ఒక రొమాంటిక్‌ హారర్‌ చిత్రం. కేవలం హారర్‌ కాకుండా మంచి ఎమోషన్‌ కూడా ఉంటుంది. ఫస్ట్‌ ఆఫ్‌ మొత్తం హారర్‌, కామెడీతో ఎంటర్‌ టైనింగ్‌గా సాగుతూ సెకండ్‌హాఫ్‌కి వచ్చేసరికి మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశాం.. అనే అనుభూతిని కలిగిస్తుంది. 

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి? 

- ఈ సినిమాలో కె ఎస్‌ అంటే కుమార్‌, స్వామి అనే ఇద్దరు బెస్ట్‌ఫ్రెండ్స్‌. 100 సంవత్సరాలు వారి ఫ్రెండ్‌ షిప్‌ అలాగే ఉండాలి అనుకుంటారు. కానీ వారి జీవితాల్లో జరిగే సంఘటనల కారణంగా వారి ఫ్రెండ్షిప్‌ వీడిపోతుంది. అసలు ఎందుకు వారు శత్రువులుగా మారారు? మళ్ళీ కలిసారా లేదా? అనేది సినిమా. 

దర్శకుడు షేర్‌ మేకింగ్‌ స్టైల్‌ గురించి చెప్పండి? 

- దర్శకుడు షేర్‌ కూడా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అన్ని శాఖలపై అవగాహన ఉంది. నాకు ఈ కథ చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఆతరువాత షేర్‌ దర్శకత్వం వహించిన చిత్రాలు చూసి ఈ కథకు పూర్తి న్యాయం చేయగలడని దర్శకత్వ భాద్యతలు ఇవ్వడం జరిగింది. తను కూడా ఎంతో ఫ్యాషన్‌తో అనుకున్న బడ్జెట్‌ లోనే సినిమాను తెరకెక్కించారు. మేము ఊహించని బడ్జెట్‌లో బిజినెస్‌ అవుతుంది. 

సినిమా బిజినెస్‌ ఎలా ఉంది? 

- చాలా బాగుంది !. సినిమా జూలై 12న రిలీజ్‌ ఉంది కాబట్టి ఆల్రెడీ మ్యాగ్జిమమ్‌ ఏరియాల్లో బిజినెస్‌ అయిపోయింది. నైజాం, సీడెడ్‌, బెంగుళూర్‌, నెల్లూరులో ఆల్రెడీ బిజినెస్‌ అయింది. త్వరలోనే క ష్ణ, గుంటూరు కూడా అవుతుంది. ఇంకా హిందీ రైట్స్‌, డిజిటల్స్‌ రైట్స్‌ నా దగ్గరే ఉన్నాయి. అవి కాకుండానే మంచి బిజినెస్‌ జరిగి నేను సేఫ్‌లో ఉన్నాను. మా సినిమాను నిజాంలో 100 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. అలాగే ఓవర్‌సిస్‌లో కూడా మంచి బిజినెస్‌ జరిగింది. 

ట్రైలర్‌ చూస్తుంటే కొంత అడల్ట్‌ కంటెంట్‌ కూడా కనిపిస్తుంది? 

- సబ్జెక్టు పరంగా కొంత అడల్ట్‌ కంటెంట్‌ అయితే ఉంది కానీ.. కథ పరంగా వెళ్ళామే తప్ప మేము ఎక్కడా పరిధి దాటలేదు. అందుకనే సెన్సార్‌ వారు ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. థియేటర్స్‌ నుండి రెస్పాన్స్‌ కూడా చాలా బాగుంది. 

హీరో హీరోయిన్స్‌ గురించి చెప్పండి? 

- మంచి కంటెంట్‌ ఉన్న స్టోరీ కాబట్టి అందరూ మోడల్స్‌ నే తీసుకోవడం జరిగింది. సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజ తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్‌ లు వారి బెస్ట్‌ పెర్ఫార్మన్సులు ఇచ్చారు. అలాగే ఇటీవల ఎన్నో సినిమాల్లో నటించి నేషనల్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న పూర్వి అనే అమ్మాయి ఒక కీలక పాత్రలో నటించింది. ఆ క్యారెక్టర్‌ మనల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది.  అలాగే కల్పన, నందిని, సుమన్ ఇలా ప్రతి ఒక్కరు తమ పరిధి మేర బాగా నటించారు. 

ఈ సినిమాను తమిళ్‌ లో డబ్‌ చేసే అవకాశం ఉందా? 

- ఇటీవల మా సినిమా చూసి నచ్చడంతో తమిళ్‌ డబ్బింగ్‌ రైట్స్‌ తీసుకున్నారు. తమిళ్‌ డబ్బింగ్‌ రైట్స్‌ కూడా మంచి రేటుకి అమ్ముడయ్యాయి. 

ఇప్పుడు చిన్న బడ్జెట్‌ సినిమాలకు రెస్పాన్స్‌ ఎలా ఉంది? 

- చిన్న బడ్జెట్‌ సినిమా అయినా, మీడియం బడ్జెట్‌ అయినా కంటెంట్‌ బాగుంటేనే రెస్పాన్స్‌ బాగుంటుంది. అందుకని నేను కూడా కంటెంట్‌ ఉన్న స్టోరీస్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాను. అందుకనే మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్, దాన్ని కరెక్ట్ గా హేండిల్ చేయగల దర్శకుడు ఉంటే ప్రేక్షకుల నుండి ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది. 

నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి? 

- మా బ్యానేర్‌లోనే దర్శకుడు షేర్‌తో ఇంకో సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. టైటిల్‌ కూడా ‘దిడైమండ్‌’ అని పెట్టడం జరిగింది. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. అది కూడా మంచి కంటెంట్‌ ఉన్న సబ్జెక్ట్‌.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి.

KS 100 Producer K Venkat Ramireddy Interview:

Producer K Venkat Ramireddy Talks about KS 100

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ