Advertisementt

ఈ మూవీ కూడా ఫట్.. ఇప్పుడీ హీరో పరిస్థితేంటి?

Sat 06th Jul 2019 09:25 PM
aadi,burrakatha movie,negetive talk,boxoffice  ఈ మూవీ కూడా ఫట్.. ఇప్పుడీ హీరో పరిస్థితేంటి?
One More Flop to Aadi Sai Kumar ఈ మూవీ కూడా ఫట్.. ఇప్పుడీ హీరో పరిస్థితేంటి?
Advertisement
Ads by CJ

కుర్ర హీరోలకు రెండు మూడు హిట్స్ తగిల్తే అలానే ఇండస్ట్రీలో ఉండిపోతారు. అసలు ఎన్ని ప్లాప్ లొచ్చినా ఇండస్ట్రీని అయితే వదలరు. అందులోను ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరోలైతే మరీను. ప్రస్తుతం సాయి కుమార్ నట వారసత్వంతో సినిమాల్లో హీరోగా వచ్చిన ఆది సాయికుమార్ హీరోగా నిలబడేందుకు నానా తంటాలు పడుతున్నాడు. లవ్లీ, శమంతకమణి, సుకుమారుడు, నెక్స్ట్ నువ్వే లాంటి సినిమాలతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. శమంతకమణి ఓ మాదిరిగా ఆడినా.. ఆ సినిమాలో సందీప్ కిషన్, సుధీర్ బాబు లాంటి హీరోలుండడంతో ఆ పేరు తలా కూస్తా వచ్చింది కానీ.. ఆదికి ఒక్కడికే ఏం ఒరగలేదు. నెక్స్ట్ నువ్వే లాంటి భారీ డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని రైటర్ గా పనిచేస్తున్న డైమండ్ రత్నబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ బుర్రకథ అనే సినిమా చేసాడు ఆది.

నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బుర్రకథ సినిమా మీద విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. కానీ విడుదలయ్యాక మొదటి షోకే సినిమాకి ప్లాప్ టాక్ పడింది. ఇక రివ్యూ రైటర్స్ కూడా బుర్రకథకు ప్లాప్ రేటింగ్స్ ఇవ్వడంతో ఆ సినిమా ప్లాప్ అని తేలిపోయింది. అసలు సినిమాలో ఇంట్రెస్ట్ కలిగించే అంశాలు తక్కువ, బోర్ కొట్టించే అంశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు. మనిషికి ఒక మెదడు మాత్రమే ఉంటుంది. అలాంటిది రెండు మెదళ్లతో ఓ మనిషి పుడితే ఎలా ఉంటుంది.. అతడు పెరిగి పెద్దయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు.. అనేది స్టోరీ లైన్. మరి ఈ సినిమాలో ఆది సాయి కుమార్ నటన పరంగా బాగా వీక్ గా కనిపించాడు. అసలు ఒకే సినిమాలో ఇటు క్లాస్, అటు మాస్ గా కనిపించే రెండు క్యారెక్టర్లు దొరకడం నిజంగా అదృష్టం. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఆది. ఇక నటన సరే సరి.. కనీసం మేకోవర్ లో కూడా మాస్ - క్లాస్ పాత్రల మధ్య తేడా చూపించలేకపోయాడు. 

నటనలో డైలాగ్ డెలివరీలో నెంబర్ వన్ అయిన సాయి కుమార్ తనయుడు ఆది నేనా ఇలాంటి నటన అన్నట్టుగా ఉంది బుర్రకథలో ఆది నటన. అసలు డైరెక్షన్ స్కిల్స్ కానీ, కథ కానీ, హీరోయిన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏమి బుర్రకథ సినిమాని కాపాడలేకపోయాయి. మరి ఇలాంటి ఘోరమైన సినిమాలు చేస్తే ఆది కెరీర్ కి ప్రమాదం పొంచి ఉన్నట్లే.

One More Flop to Aadi Sai Kumar:

Burrakatha Gets Negative Talk at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ