Advertisementt

సమంతకు తిరుగు లేదు!

Sat 06th Jul 2019 09:18 PM
samantha,hit,oh baby movie  సమంతకు తిరుగు లేదు!
Samantha Gets One More Hit With Oh Baby సమంతకు తిరుగు లేదు!
Advertisement
Ads by CJ

పెళ్లి తర్వాత హీరోయిన్స్ కి అవకాశాలు ఉండవు.. అందుకే హీరోయిన్స్ పెళ్లి అంటేనే వెనుకాడతారనే విషయం చూస్తూనే ఉన్నాం. ఏళ్ళు పైబడినా పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్స్ భయపడుతూనే ఉంటారు. అయితే టాలీవుడ్ లో ఒక హీరోయిన్ మాత్రం టాప్ పొజిషన్ లో ఉండగానే హీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే నటిస్తుందని  చైతు ఎప్పుడో చెప్పాడు. ఇక సమంత కూడా టాప్ హీరోలతో ఆఫర్స్ రాకపోయినా.. మెల్లగా కమర్షియల్ చిత్రాలకు దూరమయినా కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతుంది. పెళ్లితో ఫ్యామిలీలోను, కెరీర్ లో హిట్స్ తోనూ సమంత దూసుకుపోతుంది.

రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యు టర్న్ తాజాగా వచ్చిన ఓ బేబీ. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఓ బేబీ నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సమంత తన నటనతో సినిమాని నిలబెట్టిందంటున్నారు. 70  ఏళ్ళ బామ్మ 25  ఏళ్ళ పడుచుపిల్లగా మారిన తర్వాత తన లైఫ్ లో వచ్చే మార్పులంటే.. వయసు చిన్నగా కనిపించినా 70 ఏళ్ళ బామ్మలా హావభావాలు పలికించడంలో సమంత సూపర్ సక్సెస్ అయ్యింది. కామెడీ విషయంలో ఎలా మెప్పించిందో.. భావోద్వేగాలు పండించడంలోనూ అంతే ఆకట్టుకుంది సమంత. బేబీ పాత్రలో ఆమె అభినయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి పాత్రలు సినిమాలు అందరికీ దొరకవు. దొరికినా అందరూ సమంతలా రాణించలేరు. ఇక సమంత కూడా ఓ బేబీ సినిమా హిట్ అవుతుందని చాలా గట్టిగా నమ్మింది. సమంత నమ్మకాన్ని ఓ బేబీ నిలబెట్టినట్లే.  మరి కేవలం తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా సమంత తన హవాని పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. 

Samantha Gets One More Hit With Oh Baby:

Samantha is Lady Super Star

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ