Advertisementt

ప్రభాస్‌పై టాప్ డైరెక్టర్ కన్ను.. యువి క్రియేషన్స్ లాక్!

Sat 06th Jul 2019 07:48 PM
kannada to director,prabhas,tollywood,new movie   ప్రభాస్‌పై టాప్ డైరెక్టర్ కన్ను.. యువి క్రియేషన్స్ లాక్!
kannada top director waiting for prabhas! ప్రభాస్‌పై టాప్ డైరెక్టర్ కన్ను.. యువి క్రియేషన్స్ లాక్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నాడు. ‘సాహో’ తర్వాత ‘జాన్’ సినిమా లైన్‌లో ఉందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ కోసం మరో సినిమా రెడీ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కోసం కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ డైరెక్టర్ కథ సిద్ధం చేశారట. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ డైరెక్టర్ యు.వి.క్రియేషన్స్ సంస్థకు కథ వినిపించగా.. మేం రెడీ అంటూ ఇప్పటికే లాక్ చేసేసిందట.

ఇక మిగిలింది ప్రభాస్ మాత్రమేనని.. ఆయనకు కూడా అతి త్వరలోనే కథ వినిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్‌కు సరిగ్గా సరిపోయే కథను రాసుకొని మరీ వెళ్లాడట ఆ డైరెక్టర్. అయితే మొదట ఈ కథ కేజీఎఫ్ హీరో యశ్ దగ్గరికి వెళ్లగా.. ఏం జరిగిందో ఏమోగానీ ఆయన్ను వద్దనుకుని ప్రభాస్ అయితే న్యాయం చేస్తాడని భావించిన ఆ డైరెక్టర్ హైదరాబాద్‌కు వచ్చి వాలిపోయాడట.

మొత్తానికి చూస్తే కన్నడ టాప్ డైరెక్టర్ కన్ను ప్రభాస్‌పై పడిందన్న మాట.. మరోవైపు యువీ క్రియేషన్స్ కూడా కథ విని లాక్ చేసేసింది.  అయితే ప్రభాస్ ఈ కథ ఎప్పుడు వింటారో..? డార్లింగ్‌‌కు స్టోరీ ఏ మాత్రం నచ్చుతుందో..? నచ్చదో..? కథ విన్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో..? ఇంతకీ ఆ టాప్ డైరెక్టర్ ఎవరో..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

kannada top director waiting for prabhas!:

kannada top director waiting for prabhas!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ