Advertisementt

మహేష్, అనిల్ రావిపూడి ఫిల్మ్: అప్డేట్ అదిరింది

Sat 06th Jul 2019 04:23 PM
mahesh babu,anil ravipudi,sarileru neekevvaru,train episode,hilarious  మహేష్, అనిల్ రావిపూడి ఫిల్మ్: అప్డేట్ అదిరింది
Mahesh babu and Anil Ravipudi Film: Excellent Update మహేష్, అనిల్ రావిపూడి ఫిల్మ్: అప్డేట్ అదిరింది
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో మొదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు కానీ.. అప్పుడే ఆ సినిమాలో ఉండే కామెడీ, యాక్షన్, మహేష్ లుక్ మీద అనేకరకాల వార్తలు సామజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చేసాయి. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని.. ఈ సినిమాని అనిల్ రావిపూడి ఎప్పటిలాగే తన పంధాలోనే కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కాశ్మిర్ అండ్ ట్రైన్ ఎపిసోడ్ లు కీలక పాత్ర పోషించబోతున్నాయంటూ ఇప్పుడొక వార్త ప్రచారంలోకొచ్చింది.

కశ్మిర్ - పాక్ సరిహద్దుల్లో మిలటరీలో పనిచేసే మహేష్ బాబు తన ఊరికి ఆంధ్రాకి రావడానికి ట్రైన్ లో బయలుదేరుతాడట. అయితే కశ్మిర్ టు ఆంధ్రా అంటే చాలా లాంగ్ కాబట్టి.. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో అనిల్ రావిపూడి కమెడియన్స్ తో కలిసి హిలేరియస్ కామెడీ అందించాలని ప్లాన్ చేసాడట. ఇక సినిమాలో ఆ ట్రైన్ ఎపిసోడ్ కాస్త లెన్తీగానే ఉండబోతుందనేది లేటెస్ట్ న్యూస్. ఫస్ట్ హాఫ్ లో ఉండబోయే ఈ ట్రైన్ ఎపిసోడ్ లోనే బండ్ల గణేష్ తో పాటు పలువురు కమెడియన్లు కనిపిస్తారట. 

మరి అంతగా ట్రైన్ ఎపిసోడ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు... దానిని ఒరిజినల్ ట్రైన్ లో షూట్ చెయ్యడం చాలా కష్టం కాబట్టి.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ ట్రైన్ ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ రైలు సెట్ నే వేస్తున్నార ట. దీని కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. రష్మిక హీరోయిన్ గా నటించబోతున్న ఈసినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీ రోల్ పోషించబోతుంది.

Mahesh babu and Anil Ravipudi Film: Excellent Update:

Hilarious Train Episode in Mahesh Babu and Anil Ravipudi film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ