Advertisementt

ఘనంగా ప్రజా డైరీ ఫిలిం సెలెబ్రిటీ అవార్డ్స్

Sat 06th Jul 2019 10:17 AM
celebrities,speech,praja dairy,celebrity awards,event  ఘనంగా ప్రజా డైరీ ఫిలిం సెలెబ్రిటీ అవార్డ్స్
Praja Dairy Film Celebrity Awards Event Details ఘనంగా ప్రజా డైరీ ఫిలిం సెలెబ్రిటీ అవార్డ్స్
Advertisement
Ads by CJ

ప్రజా డైరీ ఫిలిం సెలెబ్రిటీ అవార్డ్స్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో కొణిజేటి రోశయ్య ముఖ్య అతిధిగా సినీ ప్రముఖులకు అవార్డుల ప్రధానోత్సవం జరిగినది. ఈ కార్యక్రమంలో సుమన్, జీవిత, సి కళ్యాణ్, రామ సత్యన్నారాయణ, హేమ, ఎర్ర చీర ప్రొడ్యూసర్ సత్య సుమన్, నిర్మాత గురు రాజు తదితరులు పాల్గొని ఈ అవార్డ్స్ ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

ఈ కార్యక్రమంలో సుమన్ మాట్లాడుతూ... ప్రజాడైరీ అధినేత సురేష్ తో గత 19 సంవత్సరాలుగా నాకు మంచి స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయి. ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయనలోని పట్టుదల నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఎంత దూరంలో ఉన్నా.. నా దగ్గరకి వచ్చి నన్ను ఆయన చేసే కార్యక్రమాలకు ఆహ్వానించేవాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రోశయ్య గారు చాలా అత్యున్నత పదవులను అధిరోహించిన వ్యక్తిగా, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రజలనుండి మన్ననలు అందుకున్నారు. ఆయన నాకు రాజకీయ గురువు. రోశయ్య గారితో ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి కళ్యాణ్ మొన్నే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో విజయం సాధించినందుకు ఈ సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. అలాగే జీవిత కూడా మా ఎలక్షన్స్ లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు రోశయ్యగారి పుట్టిన రోజు. ఈ సందర్భంగా రోశయ్య గారికి  జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రజా డైరీ తరుపున ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరిపించాలని సురేష్ ని కోరుకుంటూ.. సెలవు తీసుకుంటున్నాను. 

సి కళ్యాణ్ మాట్లాడుతూ... ప్రజా డైరీ సురేష్ నాకు ఎప్పటినుండో పరిచయం ఉన్నవ్యక్తి. 19 సంవత్సరాలుగా సురేష్ గారి ప్రతి ఫంక్షన్ కి రోశయ్యగారు ముఖ్య అతిధిగా హాజరవడం.. ఈ అవార్డ్స్ ఎంత విలువైనవో అర్ధమవుతుంది. ఈ అవార్డు ఫంక్షన్స్ కి రోశయ్య గారు రావడం మాకెంతో గర్వంగా వుంది. ఆయన ముఖ్య అతిధిగా తమిళనాడులో 100 సంవత్సరాల వేడుక జయ లలితగారి సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించాము. ఆ ఫంక్షన్ కి రోశయ్యగారు అన్ని తానై ముందుండి దిగ్విజయం చేశారు. అలాంటి ఆయన ఈ ఫంక్షన్ కి రావడం సురేష్ అదృష్టం అన్నారు. ఈ సందర్భంగా రోశయ్య గారికి  జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

జీవిత మాట్లాడుతూ... ప్రజా డైరీ సురేష్ తో నాకు పెద్దగా పరిచయం లేదు. ఈ అవార్డు ఫంక్షన్ కి నన్ను ఆహ్వానించడానికి వచ్చినప్పుడు నేను వస్తానని చెప్పేవరకు ఆయన అక్కడనుండి కదలలేదు. ఆయనలోని ఆ పట్టుదల చూసి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది పెద్దల మధ్యన కూర్చోవడం ఆనందంగా వుంది. రోశయ్య గారిలాంటి రాజకీయ అనుభవం కలిగిన పెద్దల మధ్య ఉన్నందుకు గర్వంగా ఫీలవుతూ.. ఆయన చేతులు మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా వుంది.

రోశయ్య గారు మాట్లాడుతూ... ప్రజా డైరీ సురేష్ ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాను నిర్వహించే కార్యక్రమాల్లో నేను పాల్గొనడం సంతోషాన్నిస్తుంది. ఈ కార్యక్రమంలో నా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా వుంది. ఎప్పుడూ సురేష్ నా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు అభినందనలు తెలుపుతున్నాను. సురేష్ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను.

ప్రజా డైరీ సురేష్ మాట్లాడుతూ... నేను గత రెండు మూడు నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు.. నాకు ‘మా’ మరియు ఇక్కడున్న ప్రముఖులు సహాయ సహకారాలు అందించారు. నేను ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా... స్పందించే సుమన్ గారు నన్ను సొంత తమ్ముడి వలె భావించేవారు. నాకు సుమన్ గారితో గత 19 ఏళ్లుగా ఉన్న అనుబంధం మరువలేది. ఆయన సలహాలు సూచనలు నాకెంతో ఉపయోగపడేవి. ఆయన తానా సభలకు అమెరికా వెళ్లాల్సి ఉండగా.. నా కార్యక్రమం కోసం వాయిదా వేసుకుని మరీ వచ్చారు. ఆయనకు సర్వదా రుణపడి ఉంటాను. నేను పిలిచిన వెంటనే వచ్చిన కళ్యాణ్ గారికి, జీవిత గారికి, హేమ గారికి, సత్య సుమన్ గారికి మరియు గురు రాజు గారికి.. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలుపుతూ.. ముఖ్యంగా రోశయ్య గారు నా ప్రతి ఫంక్షన్ కి హాజరై, నన్ను దీవిస్తున్నందుకు జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. నాకు కొండంత అండగా నిలుస్తూ ఆయన సలహాలు సూచనలు ఇస్తూ నన్నెప్పుడు ప్రోత్సహిస్తూ సొంత మనిషిలా చూసుకునే ఆయనకు ఎప్పటికి రుణపడి ఉంటాను.

Praja Dairy Film Celebrity Awards Event Details:

Celebrities Speech at Praja Dairy Celebrity Awards Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ