తెలుగులో రెండు సీజన్లతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ‘బిగ్‌బాస్’.. త్వరలోనే మూడో సీజన్‌తో ‘మా’ టీవీలో రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే వ్యాఖ్యాత ఎవరు..? ఎప్పట్నుంచి షో ప్రారంభం అవుతుంది..? అనే విషయాలు తెలిసిపోయాయి. అయితే ఈ షోలో పార్టిసిపెంట్స్ ఎవరన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఇప్పటికే నెట్టింట్లో ఇదిగో వీళ్లే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు..? కాదు కాదు.. అవన్నీ తూచ్.. లిస్ట్ లీకైంది ఇదిగోండి అంటూ పెద్ద ఎత్తున కొందరు హడావుడి చేస్తున్నారు.
వాస్తవానికి నాగ్ తనకు వ్యాఖ్యతగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదని.. ఆ హౌస్‌లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక ఆ మాటలన్నీ ఇక్కడ అనవసరం.. అప్రస్తుతం కూడా. ‘మా’ టీవీలో నాగార్జున వ్యాఖ్యతగా నటించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం విజయవంతం కావడంతో ‘మా’ టీఆర్పీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అందుకే కింగ్ అయితే బిగ్‌బాస్ షోకు న్యాయం చేసి.. సక్సెస్ చేస్తారని భావించిన నిర్వాహకులు ఆయన్ను పట్టుబట్టి మరీ ఒప్పించారట.
ఇక అసలు విషయానికొస్తే.. ఈ షోకు వ్యాఖ్యతగా ఉన్న అక్కినేని నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. నాలుగు ఐదు కాదు ఏకంగా.. రూ. 12 కోట్లు నుంచి 14 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. సీనియర్ నటుడు.. పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తి గనుక నాగ్ ఈ రేంజ్‌లో కూడా రెమ్యునరేషన్ ఎలా..? అని అక్కినేని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాగ్.. రెండు సీజన్లు కంటే ఏ మాత్రం మెప్పిస్తారో..? జూనియర్ ఎన్టీఆర్, నానిలను మించి ఆకట్టుకుంటారా..? అనేది తెలియాలంటే షో ప్రారంభం అయ్యేవరకు వేచి చూడాల్సిందే మరి.