టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ సినిమాల్లో నటించి చాలా రోజులైంది. 2004 లో ‘జై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ కొన్ని సినిమాలతో మొదట దిగ్విజయంగా టాలీవుడ్‌లో రాణించాడు. అయితే ఆ తర్వాత నవదీప్ బాగా స్లో అయిపోయాడు. ఇదే తరుణంలో బిజినెస్ మీద బాగా ఆసక్తి ఉన్న ఆయన.. ‘ఫబ్’లపై కన్నేసి లీజ్‌లకు తీసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఓ పిక్‌ను బట్టి చూస్తే నవదీప్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్.
వాస్తవానికి మొదట హీరోగా నటించిన నవదీప్.. ఆ తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్, సినిమాల్లో కీ రోల్‌లో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు లవర్ బాయ్‌గా ఈ కుర్రాడు తళుక్కుమని అలా వచ్చి ఇలా పోతుంటాడు. టాలీవుడ్‌లో నవదీప్ కనపడిన చివరి సినిమా బహుశా ‘ధృవ’ అని చెని చెప్పుకోవచ్చు. అయితే ఫిట్నెస్ పరంగా ఈ కుర్రహీరో ఇప్పుడు కాసింత వెయిట్ పెరిగి.. సరికొత్త లుక్‌లో కండలు పెంచి మరీ అభిమానులను, సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు.
ఈ లుక్‌ను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘టాలీవుడ్ సల్మాన్ ఖాన్.. నవదీప్’ అని కొందరు నెటిజన్లు అంటుండగా.. మరికొందరు ‘కెప్టెన్ అమెరికా’ అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలో నవదీప్ నటిస్తున్నాడు. బన్నీని బావగా పిలుచుకునే నవదీప్.. ఆయనతోనే ఈ మూవీలో తలపడతాడని టాక్. అంటే బన్నీ హీరోగా.. నవదీప్ విలన్‌గా నటిస్తున్నారన్న మాట. అయితే ఇది కచ్చితంగా బన్నీ సినిమా కోసమేనని.. లుక్ రివీల్ అయిపోయిందని పలువురు నవదీప్ ఫ్యాన్స్ ఇది నిజంగానే విలన్ పాత్ర కోసమేనా..? లేకుంటే మరో సినిమా ఏమైనా లైన్‌లో ఉందా..? ఒకవేళ ఇదే నిజమైతే మూవీ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.