Advertisementt

టాలీవుడ్‌లో ఈ హీరోలకు ఒకే ఒక్క హిట్ కావలెను!

Fri 05th Jul 2019 05:25 PM
tollywood heros,single hit,young heros,tollywood  టాలీవుడ్‌లో ఈ హీరోలకు ఒకే ఒక్క హిట్ కావలెను!
These tollywood Heros Want Single hit Only ! టాలీవుడ్‌లో ఈ హీరోలకు ఒకే ఒక్క హిట్ కావలెను!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో హీరోల జాతకాలు మారిపోతున్నాయ్.. కొందరు ఎంట్రీతోనే హిట్ కొట్టి ఆ తర్వాత అంతగా రాణించలేకపోయినా నిలదొక్కుకుని సినిమాలు చేస్తున్నారు. ఇక మరికొందరైతే ఆశించినంతగా హిట్లు రాక.. ఇండస్ట్రీలో ఉండాలో బయటికెళ్లిపోవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నది జగమెరిగిన సత్యమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

టాలీవుడ్‌లో ముఖ్యంగా అక్కినేని అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, గోపీచంద్, నందమూరి కల్యాణ్ రామ్, నితిన్, మంచు బ్రదర్స్, రాజ్ తరుణ్‌.. వీళ్లంతా ప్రస్తుతం ఒకే ఒక్క హిట్ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే వీరికంటే.. హీరోల్లో పలువురి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా. అయితే.. వాస్తవానికి పైన చెప్పిన ఈ హీరోలు నటించిన సినిమాలు నాటి నుంచి నేటి వరకూ హిట్ కాలేదు. ఆ సినిమాలేవి అనేది ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

పాపం.. వీరందరికీ అదృష్టం అస్సలు కలిసి రావడం లేదని తెగ బాధపడిపోతున్నారట. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోవడంతో తీవ్ర అసంతృప్తి, కసితో ఉన్నారట. మంచి కథ రాకపోతుందా..? మన పొలంలో మొలకలు రాకపోతాయా..? అని వేచి చూస్తున్నారట. అయితే వీరికి ఎవరు కథలు చెబుతారో..? ఆ కథలు ఏ మాత్రం సక్సెస్ దాకా నడిపిస్తాయో..? మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ కాలం కలిసిరాని ఈ హీరోలకు 2019లో అయినా జాతకాలు మారతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.

These tollywood Heros Want Single hit Only !:

These tollywood Heros Want Single hit Only !

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ