టాలీవుడ్ యాంగ్రీస్టార్ రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ‘దొరసాని’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ అయిపోవస్తున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో థియేటర్లలోకి తీసుకునేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే దొరసాని ఇంకా రిలీజ్ కూడా కాకమునుపే ‘శివాత్మిక’కు మరో స్టార్ డైరెక్టర్‌లలో ఒకరైన సుకుమార్ చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ మధ్య సుకుమార్‌కు పెద్దగా సినిమాలు లేకపోవడంతో సీక్వెల్ చేయాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న విషయం విదితమే. అయితే ఈ చిత్రంలో శివాత్మిక నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే గ్లామర్ రోల్‌లో యాంగ్రీస్టార్ కుమార్తె కనింపనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయ్. అంటే హెబ్బా పటేల్ తరహాలో శివాత్మిక రోల్ ఉంటుందన్న మాట.
కాగా.. ‘కుమారి 21ఎఫ్’ సీక్వెల్‌లో శివాత్మిక నటిస్తే బ్రేక్ ఖాయమని టాలీవుడ్‌లో చర్చలు వస్తున్నాయి. సినిమా ఈవెంట్‌కు వచ్చిన సుకుమార్ శివాత్మికపై పడినట్లు తెలుస్తోంది. ఈ అమ్మాయికి మన సినిమాలో చాన్స్ ఇచ్చేద్దామని సుకుమార్ ఫిక్స్ అయ్యారట. ఇదిలా ఉంటే.. ఇప్పటికే శివాత్మిక, ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్స్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సో.. సుకుమార్‌తో శివాత్మికకు అవకాశం పరిస్థితి ఎలా ఉంటుంది...? ఇది నిజంగానే జరుగుతోందా..? లేకుంటే పుకార్లకే పరిమితం అవుతుందో వేచి చూడాల్సిందే మరి.