Advertisementt

‘సైరా’ - ‘సాహో’.. ఎవరికి ఎంత దమ్ముంది?

Fri 05th Jul 2019 12:37 AM
sye raa,saaho,prabhas,chiranjeevi,business,craze,karnataka  ‘సైరా’ - ‘సాహో’.. ఎవరికి ఎంత దమ్ముంది?
Sye Raa vs Saaho in Craze ‘సైరా’ - ‘సాహో’.. ఎవరికి ఎంత దమ్ముంది?
Advertisement
Ads by CJ

ఈ ఏడాది విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో సాహో - సై రా నరసింహారెడ్డి చిత్రాలు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ సాహోకి, చిరు క్రేజ్ సై రా నరసింహారెడ్డికి బాగా హెల్ప్ అవుతున్నాయి. బాహుబలితో భారీ క్రేజ్ తో ప్రభాస్ సాహో మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక చిరు సై రాలో అమితాబ్, కన్నడ స్టార్ సుదీప్, తమిళం నుండి విజయ్ సేతుపతిలు నటించడంతో సై రా క్రేజ్ కూడా ఇండియా వైడ్ గా అదరగొట్టేస్తుంది. ఒక చోట సై రా క్రేజ్ భారీగా ఉంటే... మరోచోట సాహో క్రేజ్ కూడా అదే లెవల్లో ఉంది. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్, మెగాస్టార్ చిరు ఫ్యాన్స్ కూడా తమ తమ హీరోలను తెగ ప్రమోట్ చేస్తూ హైప్ చేస్తున్నారు.

చిరు సైరాలో పలు భాషల నటులు నటించడంతో.... ఆయా భాషల్లో సై రా సినిమాకి భారీ క్రేజ్ వచ్చేసింది. అందుకే కన్నడనాట సై రా హక్కులకు భారీ డిమాండ్ వచ్చి 35 కోట్లు వచ్చాయనే ప్రచారం ఉంది. మరి కన్నడ నటుడు సుదీప్ ఈ సినిమాలో ఓ కీ రోల్ చెయ్యడం వల్లనే సై రా కి ఆ రేంజ్ క్రేజ్ వచ్చిందనేది సత్యం. మరి బాహుబలి తో భారీ క్రేజ్ ఉన్న ప్రభాస్ సాహో సినిమా కన్నా సై రా కే కన్నడ నాట ఎక్కువ బిజినెస్ జరగడం సినీ వర్గాలను సైతం షాక్‌కు గురి చేసింది. 

ఇక మిగతా ఏరియాల కొచ్చేసరికి  సై రాని ఢీ కొట్టింది సాహో. ఒక పక్క క్రేజ్ విషయంలోనూ మరోపక్క బిజినెస్ విషయంలో ఒక సినిమాతో ఒకటి భారీగా పోటీ పడుతున్నాయి. రెండు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నారు. మరి ఎవరి సినిమాలో ఎంత దమ్ముందో అనేది ఒకటి ఆగష్టు 15 కి తెలిస్తే(సాహో రిలీజ్ డేట్) మరొకటి అక్టోబర్ 2న (సైరా రిలీజ్ డేట్) తెలుస్తుంది.

Sye Raa vs Saaho in Craze:

Business Creates Sensation Between Saaho and Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ