Advertisementt

‘పోలీస్ పటాస్’ పెద్ద హిట్టవ్వాలి: రోశయ్య

Thu 04th Jul 2019 10:49 AM
police patas trailer,k rosaiah,rama satyanarayana,police patas  ‘పోలీస్ పటాస్’ పెద్ద హిట్టవ్వాలి: రోశయ్య
K Rosaiah Launches Police Patas Trailer ‘పోలీస్ పటాస్’ పెద్ద హిట్టవ్వాలి: రోశయ్య
Advertisement
Ads by CJ

రోశయ్య ఆవిష్కరించిన పోలీస్ పటాస్ ట్రైలర్  

ఆయేషా హబీబ్, రవికాలే ప్రధాన పాత్రలలో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్ పటాస్’. బీమవరం టాకీస్‌పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తోన్న 97వ చిత్రమిది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను బిజెపి ఎంపి టి.జి.వెంకటేష్ ఆవిష్కరించారు. కాగా జూలై 4న రోశయ్య 87వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మాత రామ సత్యనారాయణ ఈ చిత్ర ట్రైలర్‌ను రోశయ్య చేత ఆవిష్కరించారు. 

ఈ సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.. రామ సత్యనారాయణ నిర్మాతగా వంద సినిమాలకు చెరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. తన బ్యానర్ నుంచి వస్తొన్న 97 చిత్రం పోలీస్ పటాస్ మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నానన్నారు. 

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. పెద్దలు రోశయ్యగారు మాకు గురువు. మా విజయాల వెనుక స్పూర్తిని అందించిన వారు. ఆయన జన్మదినం అంటే మాలాంటి వారికి పర్వదినం. ఈ సందర్బంగా త్వరలోనే మా బ్యానర్ నుంచి వస్తోన్న 97 చిత్రం ‘పోలీస్ పటాస్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్. మాస్‌కు ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నారు.

K Rosaiah Launches Police Patas Trailer:

Police Patas Trailer Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ