యాంగ్రీ మాన్ రాజశేఖర్ పెద్ద కూతురు శివానీని గ్రాండ్‌గా వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. అడివి శేష్ తో సినిమా కూడా ప్లాన్ చేసారు. 2 స్టేట్స్ అనే హిందీ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ గ్రాండ్‌గా ప్రారంభించారు కూడా. సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా అవుట్ ఫుట్ బాగా రాకపోవడంతో సినిమాను ఆపేసారు. అయితే మొన్నటివరకు ఇది ఒక రూమర్ అనుకుంటే లేటెస్ట్ గా రాజశేఖర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
కల్కి ప్రమోషన్స్ టైములో ఆయన మాట్లాడుతూ.. శివానీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఆగిపోయిందని...అది మళ్లీ సెట్స్ పైకి వచ్చేది అనుమానమే అనే విధంగా మాట్లాడాడు రాజశేఖర్. పెద్దమ్మాయి ని హీరోయిన్ చేద్దాం అనుకుంటే తన చిన్న కూతురు హీరోయిన్ అయిపోయిందని చెప్పారు. అక్కినేని ఫ్యామిలీ వారంతా కలిసి మనం సినిమా చేసినట్టు తాము కూడా అటువంటి సినిమా చేయాలి అనుకుంటున్నాం అని చెప్పాడు.
కాకపోతే మనం లాంటి సినిమా చేయడానికి చాలా టైమ్ పడుతుందని.. ఈలోపల పెద్దమ్మాయి హీరోయిన్ గా ఎదగాలి, అలానే చిన్న అమ్మాయి రెండుమూడు సినిమాలు చేయాలి అప్పుడే అటువంటి సినిమా చేయగలం అంటున్నాడు రాజశేఖర్. ఒకవేళ అటువంటి సినిమా చేయాల్సివస్తే అందులో జీవిత కూడా నటిస్తుందని తెలిపారు. బాలయ్య సినిమాలో విలన్ గా నటిస్తున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు....అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదన్నాడు అయితే విలన్, క్యారెక్టర్ రోల్స్ లో కూడా కనిపించడానికి సిద్ధమని ప్రకటించాడు. మరి ముందుగా ఏ డైరెక్టర్ ఈ హీరోని విలన్ గా చూపిస్తారో చూడాలి.