Advertisementt

మంచు ఫ్యామిలీ నుంచి నందమూరి ఫ్యామిలీకి!

Wed 03rd Jul 2019 07:29 PM
ravana,kalyan ram,nandamuri family,manchu family,krr,ravan title  మంచు ఫ్యామిలీ నుంచి నందమూరి ఫ్యామిలీకి!
Mass Title Goes to Manchu Family to Nandamuri Family మంచు ఫ్యామిలీ నుంచి నందమూరి ఫ్యామిలీకి!
Advertisement
Ads by CJ

నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాతగా ‘రావణ’ పేరుతో ఒక భారీ చిత్రం తీయాలనుకున్నాడు. ఈ మూవీకి దాదాపు 100 కోట్లు అవుతుందని అప్పటిలో అనుకున్నారు కానీ ఎందుకో అది వర్కవుట్ అవ్వలేదు. సో అలా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది. ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది కానీ టైటిల్ మాత్రం వేరే సినిమాకి ఉపయోగపడుతోంది. 

అల్లు శిరీష్‌తో ఓ సినిమా చేద్దాం అని అనుకున్న కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ట ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేసేందుకు రెడీ అయ్యాడు. ఈమూవీ కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందనుంది. దీనికి మొదట ‘తుగ్లక్’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ అది పెడితే సీరియస్ నెస్‌ పోతుందనే ఉద్దేశంతో ‘రావణ’గా మార్చారట. 

మరి ఈ టైటిల్ మంచు వాళ్లు రిజిస్టర్ చేయించారా లేదా.. వాళ్ల నుంచి వీళ్లు అనుమతి తీసుకున్నారా లేదా అన్నది తెలియదు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కబోయే చిత్రంగా చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా 118 సినిమాతో పర్లేదు అనిపించుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సతీష్ వేగేశ్నతో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తరువాత  ‘రావణ’ సినిమా ఉండే అవకాశముంది.

Mass Title Goes to Manchu Family to Nandamuri Family:

Nandamuri Hero Prefers Negative Title to Comedy Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ