సమంత - నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా రాబోయే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాలన్నిటిలో ఓ బేబీ చిత్రంపైనే అందరి ఆసక్తి ఉంది. ఎందుకంటే.. సమంత ఆ రేంజ్ లో ఓ బేబీ ప్రమోషన్స్ చేపట్టింది. సమంత చేసే సందడితో ఓ బేబీ మీద చిన్న పెద్ద ప్రేక్షకుల్లో రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. కొరియన్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ ఓ బేబీ సినిమాకి బడ్జెట్ గా ఆరు కోట్ల బడ్జెట్ పెట్టినట్లుగా సమాచారం. అయితే కొరియన్ మూవీ రీమేక్ రైట్స్ కి దాదాపుగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు 10 కోట్లు చెల్లించి హక్కులు కొన్నారట. అక్కడికి ఆ మూవీకి ఖర్చు అంటే బడ్జెట్ 16 కోట్లు అయ్యింది.
అయితే ఈ సినిమా కోసం సమంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. సమంత తనకు చుట్టమైనా ..రెమ్యునేషన్ విషయంలో సురేష్ బాబు ఎక్కడా రాజీ పడలేదని.... సమంత కు ఎంత ఇచ్చి ఉంటారు అంటే దాదాపుగా రెండు కోట్లు ఇచ్చారని ఫిలింనగర్ టాక్. మరి ఆ రేంజ్ పారితోషకం అందుకోబట్టే సమంత అన్ని తానై ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తుందని... కూడా గుసగుసలు వినబడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సమంత ఓ బేబీ ప్రమోషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.
మరి ఓ బేబీ మీద సమంతకి ఎంత నమ్మకం లేకపోతే... ఆ సినిమాని తెచ్చి నందినిరెడ్డిని డైరెక్ట్ చెయ్యమంది. సమంత చెప్పడం వల్లనే ఓ బేబీ మూవీ పట్టాలెక్కినట్లుగా దర్శకురాలు నందిని రెడ్డి తాజా ఇంటర్వ్యూలో చెప్పింది కూడా..!