Advertisementt

జూన్ ‌నెలలో ఊహించని హిట్స్ వచ్చాయ్!

Tue 02nd Jul 2019 07:26 PM
game over,agent sai srinivasa atreya,brochevaarevaruraa,hit talk,tollywood box office,june report  జూన్ ‌నెలలో ఊహించని హిట్స్ వచ్చాయ్!
June 19 Report at Tollywood Box Office జూన్ ‌నెలలో ఊహించని హిట్స్ వచ్చాయ్!
Advertisement
Ads by CJ

గత నెలలో అంటే మే లో మహర్షి సినిమా తప్ప మరే సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మహర్షి కూడా సూపర్ హిట్ అంటూ డబ్బాలు కొట్టడమే కానీ... అనుకున్నంత హిట్ అయితే కాలేదు. కానీ జూన్ నెల మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. లో బడ్జెట్ మూవీస్ జూన్ నెలలో విడుదలవడమే కాదు.. ఆ సినిమాలు ప్రేక్షకులు మెచ్చేవిలా వున్నాయి. జూన్ నెలలో ఏకంగా మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఎన్నికల అంచనాల నడుమ విడుదలైన కార్తికేయ హిప్పీ సినిమా జూన్ 6న విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇంకా చిన్న చితకా సినిమాలు చాలా జూన్ నెలలో విడుదలయ్యాయి కానీ అందులో గేమ్ ఓవర్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం, బ్రోచేవారెవరురా సినిమాలు మాత్రమే ప్రేక్షకులు మెచ్చేవిగా వున్నాయి.

తాప్సి నటించిన గేమ్ ఓవర్ జూన్ లోనే విడుదలైంది. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈసినిమాకి హిట్ టాక్ పడడమే కాదు.. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక కొత్త హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకి హిట్ టాక్ పడడం... దానితో పాటుగా వచ్చిన మల్లేశం హిట్ అన్నా.. కమర్షియల్ గా హిట్ పడలేదు. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడడంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కలెక్షన్స్ కూడా బావున్నాయి. 

సినిమాలో దమ్ముంటే... ఆ సినిమాకి కలెక్షన్స్ రావడం పెద్ద విషయం కాదని ఏజెంట్ ఆత్రేయ నిరూపించింది. ఏజెంట్ ఆత్రేయ రెండో వారంలోను మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. ఇక జూన్ చివరి వారంలో దిగిన కల్కి, బ్రోచేవారెవరురా సినిమాల్లో కల్కి పోగా.. బ్రోచేవారెవరురా సినిమా సూపర్ హిట్ అయ్యింది. శ్రీ విష్ణు నేచురల్ నటనకు, నివేత థామస్ నటనకు సినిమాలో ఉన్న కామెడీకి ప్రేక్షకులు పడిపోవడమే కాదు.. థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మరి జూన్ ఆరంభంలో ఎలా వున్నా చివరిలో మాత్రం బ్రోచేవారెవరురా అంటూ హిట్ అందించింది.

June 19 Report at Tollywood Box Office :

Game Over, Agent Sai Srinivasa Atreya, Brochevaarevaruraa gets Hit talk at tollywood Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ