Advertisementt

‘జై సేన’ షూటింగ్‌ పూర్తి.. 13 లక్షలకు పైగా వ్యూస్‌

Tue 02nd Jul 2019 01:10 PM
director samudra,jai sena,shooting,sunil  ‘జై సేన’ షూటింగ్‌ పూర్తి.. 13 లక్షలకు పైగా వ్యూస్‌
Director Samudra’s ‘Jai Sena’ Shooting complete ‘జై సేన’ షూటింగ్‌ పూర్తి.. 13 లక్షలకు పైగా వ్యూస్‌
Advertisement
Ads by CJ

 

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన సునీల్‌ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 

13 లక్షలకు పైగా వ్యూస్‌.. 

ఈ చిత్రంలో సునీల్‌లో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సునీల్‌కి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 13 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించిన ఈ టీజర్‌  సినిమా పై  అంచనాలు భారీగా పెంచింది. 

ఈ సందర్భంగా దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ..‘ఈ సినిమా టైటిల్‌ ఎనౌన్స్‌ చేసిన రోజు నుంచి అందరి నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆ తర్వాత విడుదలైన మోషన్‌ పోస్టర్‌తో ఒక విభిన్నమైన సినిమా రాబోతోందని ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన సునీల్‌ టీజర్‌కు 13 లక్షలకుపైగా వ్యూస్‌ రావడం సినిమా రేంజ్‌ ఏమిటనేది తెలియజేసింది. అలాగే ‘యుద్ధం చెయ్‌ యుద్ధం చెయ్‌’ అంటూ సాగే ‘జై సేన’ టైటిల్‌ సాంగ్‌ జనంలోకి దూసుకెళ్లింది. ఈ పాట ప్రతి ఒక్కరినీ ఇన్‌స్పైర్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. త్వరలోనే ఈ పాట లిరికల్‌ వీడియోను, విజువల్‌ వీడియోను విడుదల చేయబోతున్నాం’ అన్నారు. 

కో-ప్రొడ్యూసర్‌ పి.శిరీష్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షస్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.సముద్ర.

Director Samudra’s ‘Jai Sena’ Shooting complete:

Director Samudra’s ‘Jai Sena’ Shooting complete

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ