Advertisementt

పూరి కూడా దాన్నే నమ్ముకున్నాడా?

Tue 02nd Jul 2019 10:56 AM
director puri jagannadh,ismart shankar,charmee,actor ram  పూరి కూడా దాన్నే నమ్ముకున్నాడా?
news About Director puri jagannadh పూరి కూడా దాన్నే నమ్ముకున్నాడా?
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ సినిమాలంటే మాస్ ప్రేక్షకులకి తెగ ఇష్టం. వారికి పూరి సినిమాలు చాలావరకు కనెక్ట్ అవుతుంటాయి. ముఖ్యంగా పూరి హీరోస్ తో చెప్పించే డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, హీరోయిన్స్ గ్లామర్ షో కానీ పూరి సినిమాల్లో కామన్ గా ఉంటాయి. అలానే పూరి లేటెస్ట్ మూవీ లో కూడా ఇదే జరుగుతుంది. 

రామ్‌తో పూరి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తీసుకున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. నాభ నటేష్, నిధి అగర్వాల్. ఇద్దరూ గత సినిమాల్లో గ్లామర్ షో లేకుండా కనిపించిన ఈ ఇద్దరూ ఈ సినిమాలో మాత్రం అందాలను ఆరబోసేశారు. మెయిన్ గా సాంగ్స్ లో. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ లో, లిరికల్ వీడియోస్ చూస్తే ఈ సంగతి అర్థమైపోతోంది.

ఈచిత్రానికి సంబంధించి నాలుగు పాటలు రిలీజ్ అయితే అందులో మూడు సాంగ్స్ లో ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ షో ను హైలైట్ చేస్తే సినిమాను తెరకెక్కించాడు అని అర్ధం అవుతుంది. ఈ సాంగ్స్ సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని చిత్ర సన్నిహిత వర్గాల టాక్. ఈసినిమాతో ఈ ఇద్దరూ హీరోయిన్స్ కమర్షియల్ స్థిరపడిపోవాలని ఆశపడుతున్నారు. జులై 18 న ఈమూవీ రిలీజ్ కానుంది.

news About Director puri jagannadh:

news About Director puri jagannadh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ