Advertisementt

బిగ్‌బాస్‌-3లోకి ప్రభాస్.. ఇక చూస్కోండి!

Mon 01st Jul 2019 09:03 PM
rebal star prabhas,saaho,bigboss-3,telugu bigboss  బిగ్‌బాస్‌-3లోకి ప్రభాస్.. ఇక చూస్కోండి!
Rebel star prabhas enters Bigg Boss-3 Show..soon! బిగ్‌బాస్‌-3లోకి ప్రభాస్.. ఇక చూస్కోండి!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే. రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్‌బాస్-3 హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇదేంటి కొంపదీసి ఆయన పార్టిసిపెంట్‌గా వెళ్తారా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అదేం కాదండోయ్.. అయినా పార్టిసిపెంట్‌గా వెళ్లాల్సిన అవసరం ప్రభాస్‌కేంటి.! అసలు విషయం వేరే ఉందట.. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.  

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్‌లు, సడన్ సర్‌ఫ్రైజ్‌లతో అభిమానులు, సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచేసిన చిత్రబృందం.. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జులై మొదటి వారం నుంచి ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజిబిజీగా ఉండనుంది.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా.. తెలుగు జనాలు బాగా ఇష్టపడే.. కోట్లాది మంది వీక్షించే బిగ్‌బాస్ షోలో ‘సాహో’ ప్రమోషన్స్ షురూ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఎలాగో జులైలోనే బిగ్‌బాస్ షో ప్రారంభం కూడా సినిమా రిలీజ్‌‌కు ముందే కానుండటంతో..  మనకూ కలిసొస్తుంది కదా అని నిర్వాహకులు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ఎప్పుడొస్తారో మీరే చెప్పాలని ‘మా’ యాజమాన్యం సాహో బృందానికి చెప్పడంతో.. షో ప్రారంభమైన రెండో వారంలో అని డేట్ ఫిక్స్ చేసేసిందట. ప్రభాస్‌తో పాటు హీరోయిన్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారట. సో.. ప్రభాస్ వెళ్లిన ఆ రోజంతా హడావుడి మామూలుగా ఉండదేమో మరి. మరోవైపు మా హీరో ఎంట్రీ ఇస్తున్నారు.. ఇక చూస్కోండి అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌తో ఉన్నారట.

Rebel star prabhas enters Bigg Boss-3 Show..soon!:

Rebel star prabhas enters Bigg Boss-3 Show..soon!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ