హీరోయిన్ అమలాపాల్.. దర్శకుడు విజయ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమ పెళ్లి కాపురం దాకా వెళ్లినప్పటికీ ఎక్కువ రోజులు కలిసిమెలసి ఉండలేకపోయి.. ఆఖరికి విడాకులు తీసుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. అమలా యథావిధిగా సినిమాల్లో నటిస్తూ.. అటు విజయ్ కూడా తన డైరెక్షన్ పనిలో బిజిబిజీగా గడిపేశారు. అయితే ఇంకెన్ని రోజులు ఇలా సింగిల్‌గా ఉండాలి..? ఎవరితోనైనా మింగిల్ అయ్యి డబుల్ అవ్వాలని భావించిన విజయ్ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు.
అయితే ఈసారి మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధంలేని వ్యక్తిని చేసుకోబోతున్నాడు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. కాగా.. డైరెక్టర్ చేసుకోబోయే యువతి డాక్టర్.. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలితో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సందేశాన్ని సైతం అభిమానులు, సినీ ప్రియులతో విజయ్ పంచుకున్నాడు.
అందరిలాగే తన జీవితంలోనూ గెలుపు ఓటములున్నాయని.. విజయంలోనూ, అపజయంలోనూ తనకు తోడుగా ఉన్న మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పెద్దలు కుదిర్చిన సంబంధమని.. అందరి ఆశీర్వాదాలతో తాను జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ ఆసక్తికర ట్వీట్‌తో పాటు తాను పెళ్లిచేసుకోబోయే డాక్టరమ్మ ఫొటోను డైరెక్టర్ అభిమానులతో పంచుకున్నాడు.