యూత్‌లో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. మనోడి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు తో పాటు ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం విజయ్...భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రం లో నటించాడు. జులై 26న ఈమూవీ నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
ఇక ఈసినిమా యొక్క ప్రమోషన్స్ కూడా ఎప్పటినుండో స్టార్ట్ చేసారు. టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈసినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు అన్ని అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు మరో పాటను విడుదల చేయాలన్న దానిపై చిత్ర బృందం తర్జనభర్జనలు పడుతున్న వీడియోను విజయ్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
టీం అంత ఎడిటింగ్ రూమ్ లో కూర్చుకుని నెక్స్ట్ ఏ సాంగ్ రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్న టైములో విజయ్ వచ్చి ‘కాలేజ్ క్యాంపస్ అంటేనే ప్రేమ పక్షుల హెవెను’ అనే సాంగ్ ను రిలీజ్ చేద్దాం అని చెబుతాడు. ఆ పాట ను చిత్ర యూనిట్ అంతా పాడుతూ హుషారేతించిన ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈరోజు ఈ సాంగ్ ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.