సల్మాన్ ఖాన్ భజరంగి భాయీజాన్, సుల్తాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత వరసగా ప్లాప్స్ పడుతున్నాయి కానీ.. మళ్ళీ సూపర్ హిట్ పడడం లేదు. ట్యూబులైట్, భరత్ లాంటి సినిమాలకు ప్లాప్ టాక్ వచ్చిన సల్మాన్ క్రేజ్ తో కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపించాయి. అయితే ప్రస్తుతానికి సంజయ్ లీలా బన్సాలి తో ఒక సినిమా చేస్తున్న సల్మాన్ చూపు ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా మీద పడినట్లుగా వార్తలొస్తున్నాయి.
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో తెగ ఫెమస్ అయిన సందీప్ వంగ తన రెండో సినిమాని మహేష్ తో చెయ్యాలనుకున్నాడు. కానీ మహేష్ తో కుదరకపోయేసరికి.. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం కబీర్ సింగ్ కలెక్షన్స్ చూస్తుంటే... ఈ సినిమా ఎక్కడికెళ్ళి ఆగుతుందో ట్రేడ్ పండితులు కూడా చెప్పలేకపోతున్నారు. క్రిటిక్స్ ఇచ్చిన వీక్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది కబీర్ సింగ్. ఈ దెబ్బకి సందీప్ వంగా కి బాలీవుడ్ లోను బోలెడంత క్రేజ్ అవచ్చేసింది.
అయితే సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడో అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అసలు సందీప్ వంగ సినిమా టాలీవుడ్ లోన, బాలీవుడ్ లో ఉంటుందో అనేది టోటల్ కన్ఫ్యూజన్. ఈలోపు సల్మాన్ ఖాన్, సందీప్ వంగా వైపు చూస్తున్నాడు.. ఇప్పటికే సందీప్ వంగాని సల్మాన్ కలిసాడని బిటౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మరి నిజంగా సందీప్ వంగాకి సల్మాన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే... సందీప్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయి.. టాలీవుడ్ స్టార్ హీరోలకు అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయం గా కనబడుతుంది.