ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ - ఆదా శర్మ జంటగా తెరకెక్కిన కల్కి సినిమా మొన్న శుక్రవారం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ పడినా.. ప్రేక్షకులు మాత్రం కల్కి ఉన్న థియేటర్స్ వంక చూడడం లేదు. అందుకే ఈ వీకెండ్ లో కల్కి బుకింగ్స్ చాలా డల్‌గా వున్నాయి. అయితే కల్కితో పాటుగా విడుదలైన బ్రోచేవారెవరురా సినిమా హిట్ టాక్ పడడంతో.. ప్రేక్షకుల చూపు ఆ సినిమా మీదే ఉంది. కల్కి సింగిల్ గా దిగితే ఎమన్నా వర్కౌట్ అయ్యేది కానీ.. బ్రోచేవారెవరురాతో పెట్టుకుంది.. గనక యావరేజ్ టాక్‌తో థియేటర్స్ దగ్గర బెంబేలెత్తుతుంది.
అయితే ఏ ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన ఆదా శర్మ మాత్రం.. ఈ దెబ్బకి టాలీవుడ్‌కి దూరమవడం ఖాయం. అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలో నటించినా క్రేజ్ తెచ్చుకోలేని ఈ భామ చిన్న చితక వేషాలకే పరిమితమైంది. కల్కి సినిమాలో డాక్టర్‌గా ఆదా శర్మ బాగానే ఉన్నప్పటికీ.. ఆమెకు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరక్క పోవడం వలన ఆదా పాత్ర కల్కి లో తేలిపోయింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో హల్చల్ చేసే ఆదా శర్మ ఇప్పుడు ఇక ఆ సోషల్ మీడియానే నమ్ముకున్నప్పటికీ.. ఈ భామకి టాలీవుడ్ లో ఛాన్స్ ఇచ్చే నాధుడు మాత్రం కనబడ్డం లేదు. ఇక బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్న ఆదా పరిస్థితి ఆ సినిమాలు విడుదలైతే గాని తెలియదు.