Advertisementt

మహేష్‌కు పోటీగా అల్లు అర్జున్..!

Sun 30th Jun 2019 06:56 PM
allu arjun,trivikram srinivas,sankranthi race,sarileru neekevvaru,mahesh babu,balakrishna  మహేష్‌కు పోటీగా అల్లు అర్జున్..!
Fight between Mahesh Babu and Allu Arjun మహేష్‌కు పోటీగా అల్లు అర్జున్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. పెద్ద సినిమా రిలీజ్ చేయడానికి సంక్రాంతి కన్న బెటర్ సీజన్ ఏం ఉంటది? ఇది చాలా సినిమాలకి చాలాసార్లు రుజువు అయింది. అందుకే బన్నీ అండ్ త్రివిక్రమ్ కూడా వచ్చే సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు.

దీంతో ఆల్రెడీ సంక్రాంతి బరిలో వున్న మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి అతి పెద్ద పోటీదారుగా ఈ చిత్రం నిలుస్తుంది. ఇలా ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే అడ్వాంటేజ్ ఏ సినిమాకి ఉంటుంది? కంటెంట్ ఏది బాగుంటే ఆ సినిమా రేస్ లో నిలబడుతుంది. అల్లు అర్జున్ సినిమాకి పకడ్బందీ స్క్రిప్ట్‌ పెట్టుకుని ఫ్యామిలీ డ్రామాతో త్రివిక్రమ్‌ రెడీ గా ఉంటే అనిల్ రావిపూడి కామెడీ టచ్ తో మాస్ ప్రేక్షకుల దగ్గరవ్వాలని చూస్తున్నాడు.

ఇలా రెండు పెద్ద సినిమాలు 2020 సంక్రాంతికి రెడీగా ఉండడంతో అప్పుడే ఆసక్తికరంగా మారిపోయింది. ఇక అలానే ప్రతి సంక్రాంతికి విధిగా వస్తోన్న బాలకృష్ణ సినిమా వచ్చే సంక్రాంతికి కూడా విడుదల కానుంది కనుక ఇక మిగతా సినిమాలకి స్పేస్‌ లేదనే చెప్పాలి.

Fight between Mahesh Babu and Allu Arjun:

Allu Arjun and Trivikram Film in Sankranthi Race

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ