Advertisementt

శ్రీకాంత్ విడుదల చేసిన ‘అక్షరం’ ట్రైలర్

Sun 30th Jun 2019 05:37 PM
aksharam,srikanth,trailer,lohit,jocky thota,aksharam movie  శ్రీకాంత్ విడుదల చేసిన ‘అక్షరం’ ట్రైలర్
Hero Srikanth Releases Aksharam Movie Trailer శ్రీకాంత్ విడుదల చేసిన ‘అక్షరం’ ట్రైలర్
Advertisement
Ads by CJ

ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసే సినిమా ‘అక్షరం’ - ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్..!!

మిమిక్రీ కళాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా 7000 ప్రదర్శనలు ప్రదర్శించి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ వ్యక్తి లోహిత్ కుమార్.. టీవీ నటుడిగా ఇప్పటివరకు 19 మెగా డైలీ సీరియల్స్ లో దాదాపు పదహారువేల ఎపిసోడ్స్ లో నటించిన అయన 60 సినిమాల్లో విభిన్న భూమికలు పోషించి ప్రస్తుతం అక్షరం అనే సినిమాని నిర్మించారు. పిఎల్ క్రియేషన్స్ బ్యానర్ లో జాకీ తోట దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ చిత్ర ట్రైలర్, ఫస్ట్ లుక్ లని ప్రముఖ హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు..    

ఈ సందర్భంగా దర్శకుడు జాకీ మాట్లాడుతూ.. నేను నటుడిగా అందరికి పరిచయమే. దర్శకుడిగా చేస్తున్న మొదటి సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా. అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన హీరో శ్రీకాంత్ గారికి చాలా చాలా థాంక్స్ అన్నారు. 

నిర్మాత లోహిత్ మాట్లాడుతూ.. ‘అక్షరం’ సినిమా టీజర్ లాంచ్ చేయడానికి ఒప్పుకున్న ప్రముఖ హీరో శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే సినిమా ఇది. జాకీ గారు సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాకి పరుచూరిగారి సూచనలు మర్చిపోలేనివి. ఈ సినిమా కథ విన్న ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అన్నారు. ప్రేక్షకులకు కూడా చాలా బాగా నచ్చుతుంది..అన్నారు. 

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరినీ ఆలోచింప చేసే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. పిల్లలు మరీ ముఖ్యంగా చూడాల్సిన సినిమా ఇది. పిల్లలకోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారో, వారి భవిష్యత్ కోసం ఏమేం చేస్తారో ఈ సినిమా ద్వారా  మీరు చూడబోతున్నారు. ఈ సినిమా తొందరలో మీ ముందుకు రాబోతుంది.. తప్పక చూడండి అన్నారు.

Hero Srikanth Releases Aksharam Movie Trailer:

Aksharam Movie Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ